పవన్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ మాజీ సతీమణి రేణూ అన్నట్లుగా ఉంది తాజా పరిస్థితి. గతానికి భిన్నంగా రేణూ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ పవన్ ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేసిందంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ తీరును ప్రశ్నల రూపంలో సంధించిన ఆమె వైఖరిలో చాలా తేడా వచ్చినట్లుగా పవన్ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్..రేణు విడిపోవటానికి కారణాలేంటి? అన్న అనుమానాలపై తన తాజా ఇంటర్వ్యూలలో రేణు కాస్తంత క్లారిటీ ఇచ్చేసినట్లుగా చెప్పాలి. తాను వదినను కాదని.. అన్నాను వదినగా భావించాలంటూ పవన్ ఫ్యాన్స్ కు చెప్పటంతో పాటు.. పవన్ ను పరోక్షంగా ప్రశ్నించినట్లుగా ఆమె తాజా ఇంటర్వ్యూ ఉందంటున్నారు. దీంతో.. రేణూపై మరోసారి ట్రోలింగ్ కు దిగుతున్నారు పవన్ అభిమానులు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తామిద్దరం విడిపోయాక.. అన్నా లెజ్ నెవాను పెళ్లాడిన పవన్.. ఆమె ద్వారా మళ్లీ తండ్రి అయ్యారని తెలుసుకున్నానని..పవన్ తో మాట్లాడినట్లు చెప్పారు. అన్నా లెజెనోవాతో కూడా మాట్లాడానని.. ఇరువురికి కంగ్రాట్స్ చెప్పినట్లుగా వెల్లడించారు. తామిద్దరి మధ్య స్నేహబంధం అలానే ఉందన్నారు.
పవన్ తో సంబంధాలు బాగా ఉన్న సమయంలో రేణూ మాట్లాడిన మాటలకు.. తాజాగా మరొకరిని పెళ్లాడనున్న వేళ ఆమె మాట్లాడుతున్న మాటలకు పొంతన లేదంటున్నారు. దీంతో హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ రేణూ పాత వీడియోక్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆమెపై మాటల దాడికి దిగుతున్నారు.
రేణూ టోన్ మారటానికి కాబోయే భర్త కుటుంబం కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే.. ఇన్నాళ్లు తన కడపులో దాచుకున్న కొన్ని విషయాల్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే రేణూ బరస్ట్ అయి ఉండొచ్చన్న మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా.. రేణూ చెప్పాల్సిన మాటలు చెప్పిన నేపథ్యంలో.. పవన్ పెదవి విప్పితే మొత్తంగా విషయాల మీద క్లారిటీ వస్తుందంటున్నారు. అయితే.. ఇలాంటి అంశాల మీద పవన్ నోరు విప్పని వైనం తెలిసిందే. మరి.. ఇదే తీరులో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ దాడిపై రేణు మరోసారి రియాక్ట్ అయితే పవన్ కు ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ మీద రాజకీయంగా దాడి చేసేందుకు వీలుగా కొన్ని మీడియా సంస్థలు తెలివిగా రేణును ఇంటర్వ్యూలు చేస్తూ.. ప్రశ్నల రూపంలో తమకు కావాల్సిన రీతిలో సమాధానాలు వచ్చేలా చేస్తున్నారంటున్నారు. అయితే ఈ వాదన తప్పని.. రేణూ ఏమీ చిన్న పిల్ల కాదని.. ఆమెకు ఆ విషయాలు తెలీనంత అమాయకురాలు ఏమీ కాదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. రేణూ నోటి వెంట వస్తున్న మాటలు పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతూ పాత వీడియోక్లిప్పులు తీస్తుంటే.. వాటిపై రేణు మరోసారి స్పందిస్తే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.