పవర్ స్టార్.. హ్యాట్రిక్ 50 కొట్టాడు

Update: 2017-03-30 12:14 GMT
సినిమా టాక్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం 50 కోట్ల షేర్ వచ్చి పడాల్సిందన్నమాటే. తొలిసారి ‘గబ్బర్ సింగ్’తో రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకున్న పవర్ స్టార్.. ఆ తర్వాత నాలుగేళ్ల కిందట ‘అత్తారింటికి దారేది’ సినిమాతో మరోసారి ఆ మార్కును దాటాడు. ఆ చిత్రం రూ.85 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇక అప్పట్నుంచి పవన్ అలవోకగా రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకుంటున్నాడు. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ అయినా సరే.. రూ.50 కోట్ల షేర్ మార్కును దాటింది. ఇప్పుడు ‘కాటమరాయుడు’ సైతం డివైడ్ టాక్ లోనూ ఈ ఘనతను అందుకుంది. దీంతో వరుసగా మూడు 50 కోట్ల షేర్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు పవన్.

‘కాటమరాయుడు’ వరల్డ్ వైడ్ షేర్ బుధవారంతో రూ.50 కోట్ల మార్కును దాటింది. తొలి వారాంతంలో వరల్డ్ వైడ్ రూ.43 కోట్ల షేర్ రాబట్టిన ‘కాటమరాయుడు’.. సోమ.. మంగళవారాల్లో డల్ అయినప్పటికీ.. ఉగాది సెలవైన బుధవారం నాడు పుంజుకుంది. ఈ చిత్రం ఈ రోజు రూ.5 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు అంచనా. దీంతో మొత్తం షేర్ రూ.50 కోట్లను దాటింది. ఈ రోజు.. రేపు కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉంటాయని.. మళ్లీ వీకెండ్లో రెండు రోజులు సినిమా పుంజుకుంటుందని.. ఆదివారం అయ్యేసరికి షేర్ రూ.60 కోట్లకు చేరువ అవుతుందని భావిస్తున్నారు. అలా చూసినప్పటికీ ఈ సినిమా ఇంకా పాతిక కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ కు వస్తుంది. మరి ఫుల్ రన్లో లాస్ ఎంత తేలుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News