PSPK 2020 మిష‌న్: ఏడాదికి ఐదు సినిమాలా?

Update: 2020-02-02 06:31 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి  తెలిసిందే. పింక్ రీమేక్ స‌హా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాని ప్రారంభించేశాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో లాయ‌ర్ సాబ్.... క్రిష్ పీరియాడిక్ సినిమాల్ని జెట్ స్పీడ్ తో పూర్తి చేయ‌నునున్నాడు. ఈ రెండు కాకుండానే నిన్న‌నే హ‌రీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. తాజాగా ఈ మూడు చిత్రాలు గాకుండానే మ‌రో ఇద్ద‌రు దర్శ‌కుల‌ను కూడా ప‌వ‌ర్ స్టార్ లైన్ పెడుతున్న‌ట్లు తెలిసింది. జెర్సీ ఫేం గౌత‌మ్ తిన్న‌నూరితో కూడా ఓ సినిమా చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

గ‌తంలో గౌత‌మ్ ప‌వ‌న్ ను క‌లిసి అమెరికాలో ఓ స్క్రిప్ట్ ని వినిపించాడు. దానికి ఇప్పుడు గ్రీన్ సిగ్న‌ ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అప్ప‌ట్లో రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌టంతో వ‌ల్ల క‌థ న‌చ్చినా చేయ‌లేని ప‌రిస్థితి. కానీ మ‌ళ్లీ  ఇప్పుడు ప‌వ‌న్ స్పీడందుకోవ‌డంతో కొత్త క‌మిట్ మెంట్ల విష‌యంలో ఆల‌స్యం చేయ‌డం లేదు.  ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి గౌత‌మ్ ప‌వ‌న్ తో సంప్ర‌దింపులు జ‌రిపి స్క్రిప్ట్ లాక్ చేసిన‌ట్లు వినిపిస్తోంది. అలాగే డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో కూడా  మ‌రో సినిమా కు స‌న్నాహాలు చేస్తున‌న్నాని వెల్ల‌డించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

అన్ని అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే ప్రాజెక్ట్ ఏ క్ష‌ణ‌మైనా లాక్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. గ‌తంలో ఇదే కాంబినేష‌న లో తెర‌కెక్కిన బ‌ద్రీ మంచి విజ‌యం సాధించిన‌ సంగ‌తి తెలిసిందే.   త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్యా అభిప్రాయ భేధాలు త‌లెత్త‌డంతో కొన్నాళ్లు  క‌లిసి ప‌నిచేలేదు. చాలా ఏళ్లు త‌ర్వాత మ‌ళ్లీ  కెమెరా మేన్ గంగ‌తో  రాంబాబు కోసం చేతులు క‌లిపారు. అటుపైనా  ఇద్ద‌రి మ‌ధ్య వివాదం స‌మ‌సిపోలేద‌ని ప్ర‌చార‌మైంది. అయినా.. తాజాగా మ‌రోసారి పూరి పేరు తెర‌పైకి  రావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ప‌వ‌న్ వెంట వెంట‌నే సినిమాలు అంగీక‌రించ‌డానికి కార‌ణం పార్టీని నిలుపుకునేందుకు ఫండ్ కోస‌మేన‌న్న వాద‌నా ఉంది. ఒక్కో క‌మిట్ మెంట్ కి 50కోట్ల ప్యాకేజీ ని డిమాండ్ చేస్తూ భారీగానే వెన‌కేయాల‌న్న ప్లాన్ ఉందిట‌. ఇక ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాలు చేస్తుండ‌డంతో కీల‌క నాయ‌కులంతా జ‌న‌సేన నుంచి జారిపోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అయితే త‌న‌ను త‌న పార్టీని కాపాడుకునేందుకే సినిమాలు చేస్తున్నాన‌ని ప‌వ‌న్ వివ‌ర‌ణ ఇవ్వ‌డం తెలిసిందే. రాజ‌కీయ నాయ‌కులు ఇత‌ర బిజినెస్ లు చేసుకున్న‌ట్టే తాను త‌న ఉపాధిని వెతుక్కుని వెళుతున్నాన‌ని ప‌వ‌న్ అంటున్నారు.


Tags:    

Similar News