పాలిటిక్స్ అంటే చంపేస్తారా? -పవన్

Update: 2017-02-11 11:56 GMT
టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడైన పవన్ కళ్యాణ్ ను.. పవర్ స్టార్ గా జనాలు ఓ రేంజ్ లో ఆరాధిస్తారు. పవనిజం అంటూ సెపరేట్ గా ఓ ఇజం డెవలప్ అయిందంటే.. పవన్ భావజాలం ఏ స్థాయిలో పాపులర్ అనే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్నాడు పవన్. న్యూ హాంప్ షైర్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ పవన్ మాట్లాడిన పదునైన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

'నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించినపుడు లేదా పాలిటిక్స్ లోకి ప్రవేశించినపుడు.. చాలామంది చాలా రకాలుగా బెదిరించారు. అందులో నన్ను చంపేస్తారనే బెదిరింపులు కూడా ఉన్నాయి. నన్ను తిట్టిపోస్తూ చాలానే లెటర్స్.. ఈమెయిల్స్ కూడా వచ్చాయి. అయితే.. ఇలాంటి వాటన్నిటికీ భయపడాలా? అలా భయపడేటట్లే అయితే.. ఇంత దూరం ఎలా రాగలను?'అన్నాడు పవన్.

'నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఏదైనా సమస్యపై స్పందించేటపుడు పది సార్లు ఆలోచిస్తాను. ఒకసారి నిర్ణయించుకున్నాక.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. రోజుకోసారి చావడం కంటే ఒకేసారి చనిపోవడం ఉత్తమం కదా' అన్న పవన్..  'దేశం నీకేమిచ్చింది అని కాదు.. దేశానికి నువ్వు ఏం ఇచ్చావ్ అని ప్రశ్నించుకో' అంటూ జాన్ ఎఫ్ కెన్నెడీ మాటలను గుర్తు చేసుకున్నాడు.

పవన్ మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం అంతా చప్పట్లు.. ఈలలతో దద్దరిల్లిపోయింది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 14వ ఎడిషన్ ఈ నెల 11 నుంచి జరగనుండగా.. దానికి ముందు పలు ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.
Tags:    

Similar News