పవన్ మళ్ళీ సింగేస్తున్నాడా??

Update: 2017-11-20 16:46 GMT

పవన్ కళ్యాణ్ కు గొంతు సవరించుకోవడం కొత్తేమీ కాదు. కాకపోతే గతంలో చిన్న చిన్న బిట్స్ తో సరిపెట్టేవాడంతే. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది చిత్రంలో 'కాటమరాయుడా' అంటూ పూర్తి స్థాయిలో ఓ సాంగు సింగేశాడు.

ఆ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ పాట పాడిన సందర్భం లేదు. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనే రూపొందుతున్న చిత్రంలో ఓ పాటను పాడనున్నాడట పవన్. 'కొడకా కోటేశ్వరరావా' అంటూ ఈ లిరిక్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. నిజంగా పవన్ ఇలాంటి పాట పాడతాడా.. అసలు ఇలాంటి పాట సినిమాలో ఉందా అనే విషయంపై కొన్ని సందేహాలు ఉన్న మాట వాస్తవమే కానీ.. పవన్ తో పాట పాడించేందుకు త్రివిక్రమ్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పవన్ పాడితే సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు.

తను ఎంజాయ్ చేస్తూ పాట పాడి.. అభిమానులను అంతకు మించి ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వడంలో పవన్ సిద్ధహస్తుడు. అందుకే పవన్ తో మరోసారి పాడించేసి.. సినిమాకు ఈ పాటను పెద్ద అస్సెట్ చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడట. సిట్యుయేషనల్ గా కూడా ఈ కోటేశ్వరరావా పాట సూపర్బ్ గా ఉంటుందని.. ఆడియన్స్ కు మరోసారి కాటమరాయుడా ఫీల్ ను అందిస్తుందని.. ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News