ఖైదీ ఫంక్షన్ పై పవన్ క్లారిటీ ట్వీట్

Update: 2017-01-07 09:12 GMT
మరో ట్వీట్ పెట్టేశాడు పవన్. ఉద్దానం ఇష్యూపై ఏపీ సీఎం చంద్రబాబుకు అల్టిమేటం ఇవ్వటం.. దానికి ఆయన పాజిటివ్ గా రియాక్ట్ కావటం.. బాధితులకు అందించే సాయం గురించి ప్రకటన చేయటం తెలిసిందే. దీనికి ప్రతిగా బాబుకు థ్యాంక్స్ చెప్పిన పవన్.. ట్వీట్లు చేశారు. కాసేపటి కిందట మరోసారి ట్వీట్ చేశారు. అయితే..ఈ ట్వీట్ మొత్తం మెగా అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న అంశం మీదది కావటం గమనార్హం.

ఖైదీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్  వెళతారా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారి.. గడిచిన కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు అన్నిఇన్ని కావు. ఇప్పుడా సందేహాల్ని తీర్చేలా పవన్ ట్వీట్ ఉండటం గమనార్హం. ఫంక్షన్ స్టార్ట్ కావటానికి కొద్ది గంటల ముందు పెట్టిన ఈ ట్వీట్ లో.. ఖైదీ చిత్రం అలరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పటంతో పాటు.. సినిమాలో నటించిన నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు తన మన:పూర్వక శుభాకాంక్షలు చెప్పేశారు.

పవన్ తాజా ట్వీట్ తో ఆయన ఫంక్షన్ కు వెళ్లటం లేదన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే చెప్పాలి. అంతేకాదు.. ట్వీట్ లో ఉన్న పదాలు కూడా కాస్తంత కొత్తగా కనిపించినట్లుగా చెప్పొచ్చు. ‘‘చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవిగారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబరు 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు - సాంకేతిక నిపుణులకు నా మన:పూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొనటం ద్వారా.. ఫంక్షన్ కు వెళ్లనన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఫంక్షన్ కు వెళ్లేటట్లైయితే.. శుభాకాంక్షల ట్వీట్ చేయరన్నది ఒక మాట అయితే.. ట్వీట్ మొత్తంలో ‘చిరంజీవిగారు’ అన్న మాటను వాడారే కానీ.. అన్నయ్య అన్న పదాన్ని వాడకపోవటం గమనార్హం. అన్నయ్య అన్న మాటను పవన్ ప్రస్తావించకపోవటం ఏమిటి..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News