సినిమా తీయడం కాదు.. తీసిన మూవీ హిట్ అవుతుందా లేదా అసలు డైరెక్టర్ కి సత్తా ఉందా లేదా అని జడ్జ్ చేయగల్గడం ఓ ఆర్ట్. ఎవరి దగ్గర టాలెంట్ ఉందో గుర్తిస్తే గొప్ప నిర్మాత అయిపోయినట్టే. అందుకే ఉన్న వాళ్లలో దిల్ రాజు ఎప్పుడూ సమ్ థింగ్ స్పెషలే. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరడానికి పెళ్లిచూపులు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కూడా ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు.
పెళ్లిచూపులు మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ కి వచ్చినంత స్టేటస్ వచ్చేయడమే కాదు తరుణ్ భాస్కర్ లాంటి టాలెంటెడ్ దర్శకుడ్ని పరిచయం చేశాడన్న క్రెడిట్ కూడా రాజ్ కందకూరి సొంతమైంది. ఇక ఒక్కసారి హిట్ కొట్టి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాడనే పేరు వస్తే చాలు.. వాళ్ల నుంచి ఏ సినిమా వచ్చినా ఆడియెన్స్ లో క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే రాజ్ కందుకూరి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లోనూ కొత్త వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ తర్వాత వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నాడు.
షార్ట్ ఫిల్మ్స్ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో అనే మూవీ తీస్తున్నాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకొంటున్న శ్రీ విష్ణు ఇందులో హీరో. మంచి కథతో పాటు ఔట్ అండ్ ఔట్ కామెడీతో సాగే ఈ మూవీ కూడా హిట్ అవుతుందనేది రాజ్ కందుకూరి నమ్మకం. అంతేకాదు ఫ్యూచర్లో కూడా కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తానని.. అల్రెడీ కొందరు సబ్జెక్ట్స్ వినిపిస్తున్నారని.. వాటిలో ద బెస్ట్ సెలక్ట్ చేసి మూవీస్ తీస్తా అంటున్నాడు. మరి టాలెంట్ ను ఎంకరేజ్ చేసే రాజ్ కందుకూరిని మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.