టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిట్నెస్ ఫ్రీక్ అని మాట్లాడుకునే హీరోయిన్స్ లో అక్కినేని కోడలు సమంత ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత.. ఎంతోమంది అప్ కమింగ్ హీరోయిన్లకు ఫిట్నెస్ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పటికే కెరీర్ పరంగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సామ్.. ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ఆ జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. తాజాగా అమ్మడు గాలిలో త్రాడుకు తల క్రిందకి కాళ్ళు పైకి పెడుతూ.. గాల్లో తలకిందులుగా వేలాడుతున్న ఆసనం వేసింది. ఆ ఫోటోలో సామ్ ఎంతో జాగ్రత్తగా త్రాడు సహాయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. అలా వేలాడుతున్న పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో.. లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేదని కాప్షన్ జోడించింది.
ప్రస్తుతం సామ్ యోగాసనంతో పాటు లైఫ్ గురించి రాసిన లైన్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిజానికి సామ్ కెరీర్ పరంగా కాస్త నెమ్మదించింది. జానూ సినిమా తర్వాత సమంత నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కేవలం ఓ హిందీ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీమ్యాన్ -2' లో నటించింది. కానీ తెలుగు తమిళ సినిమాలలో మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ సినిమా 'కాతువకుల రెండు కాదల్' కాగా మరొకటి పాన్ ఇండియా మూవీ శాకుంతలం. ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం కాతువకుల రెండు కాదల్ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. శాకుంతలం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమాగా గుణశేఖర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అమ్మడు కరోనా వలన చిన్న గ్యాప్ దొరికినా వర్కౌట్స్ కోసమే కేటాయిస్తుంది.