పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్.. ఇంట్లోనే చికిత్స‌

Update: 2021-04-26 03:28 GMT
అందాల క‌థానాయిక పూజా హెగ్డేకు క‌రోనా సోకింది. COVID-19 కు పాజిటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌స్తుతం గృహ‌ నిర్బంధంలో ఉన్నాన‌ని పూజా  తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి సురక్షితంగా ఉండమని కోరారు.

కరోనావైరస్ రెండవ వేవ్ లో చాలా మంది సెల్రిటీల‌కు స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంద‌రూ ఇండ్ల‌లోనే ఉండాల‌ని పూజా హెగ్డే కోరారు. నేను అన్ని ప్రోటోకాల్ లను అనుసరించి చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల న‌న్ను క‌లిసిన వారంతా కూడా పరీక్ష‌లు  చేయించుకోవాల‌ని నేను అభ్యర్థిస్తున్నాను.. అని అన్నారు.

``నేను ప్రస్తుతం బాగా కోలుకుంటున్నాను. మీ ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు. దయచేసి ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి.. .. జాగ్రత్త వహించండి`` అని హెగ్డే ట్విట్టర్లో ఒక ప్రకటనలో తెలిపారు.

టాలీవుడ్ బాలీవుడ్ లో చాలామంది స్టార్ల‌కు కోవిడ్ సోకింది. ప‌లువురు గృహ‌నిర్భంధంలో ఉన్నారు. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ కి కోవిడ్ సోక‌గా చికిత్స‌తో కోలుకున్నారు. బాలీవుడ్ లో కొన్ని వారాల వ్యవధిలో ప్రముఖులకు క‌రోనా సోకింది. ఇటీవల సోనూసూద్.. నీల్ నితిన్ ముఖేష్, .. మనీష్ మల్హోత్రా.. కత్రినా కైఫ్.. అక్షయ్ కుమార్.. గోవింద.. పరేష్ రావల్.. అలియా భట్.. రణబీర్ కపూర్.. రోహిత్ సారాఫ్ తదితరులు కోవిడ్ -19 కు పాజిటివ్ వ‌చ్చింది. అంతకుముందు అమితాబ్ బచ్చన్.. చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్‌.. అభిషేక్ బచ్చన్.. అర్జున్ కపూర్.. మలైకా అరోరా మరికొందరు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పూజా హెగ్డే ప్ర‌స్తుతం సిర్కస్ -ఆచార్య చిత్రాల్లో న‌టిస్తోంది. ప్రభాస్ సరసన రాధే శ్యామ్.. అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాల్లో న‌టించింది.
Tags:    

Similar News