ప్రభాస్ సినిమాకి ముహూర్తం పెట్టారహో

Update: 2016-07-02 04:22 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. గత కొన్నేళ్లుగా బాహుబలి మూవీకే అంకితం అయిపోయాడు. బాహుబలి కోసం భారీగా శరీరాన్ని పెంచేసిన ప్రభాస్.. రాజమౌళి కోరినట్లుగా వేరే ఏ సినిమాకి సైన్ చేయలేదు. ఇప్పుడు బాహుబలి రెండో భాగం క్లైమాక్స్ షూటింగ్ వరకూ వచ్చేసింది. దీంతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్టు పై కదలిక మొదలైంది. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ అంగీకరించిన విషయం తెలిసిందే.

సుజీత్ డైరెక్షన్ లో ప్రారంభం కానున్న సినిమాని.. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించనున్నాడట ప్రభాస్. ఈ మేరకు ఓ నెల ముందుగానే అంటే నవంబర్ లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేయబోతున్నారు నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వీరు ప్రభాస్ స్నేహితులే కాగా.. తనకు యూవీ క్రియేషన్స్ హోమ్ బ్యానర్ లాంటిది అని ఇప్పటికే ప్రభాస్ చెప్పేశాడు కూడా. మూడేళ్ల తర్వాత బాహుబలి కాకుండా ప్రభాస్ మరో చిత్రం ప్రారంభించనుండడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

ప్రభాస్-సుజీత్ కాంబినేషన్ లో రానున్న మూవీకి 80 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నది ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ చాలానే వెయిట్ పెరిగాడు. ఇప్పుడు ఆగస్ట్ చివరి నాటికి బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ పూర్తి కానుండగా.. ఆ సినిమా కోసం పెరిగిన వెయిట్ అంతా.. కొత్త సినిమా ప్రారంభంలోపు ప్రభాస్ కరిగించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ విషయంలో యంగ్ రెబల్ స్టార్ కింగ్ లాంటోడు లెండి.. కంగారేం అక్కర్లేదు.. కరిగించేస్తాడు.
Tags:    

Similar News