మనవైన ఇతిహాసాలు భారతీయ పురాణాల్ని కాపీ కొట్టి.. సినిమాలో క్యారెక్టర్లు క్రియేట్ చేసి బిలియన్ డాలర్ వసూళ్లను కొల్లగొట్టారు జేమ్స్ కామెరూన్ అండ్ టీమ్. అవతార్ సంచలనాల గురించి తెలిసిందే. ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేయడానికి దశాబ్ధం పైగా పట్టింది. అవెంజర్స్ సిరీస్ చివరి సినిమాతో అది సాధ్యమైంది.
అదంతా సరే కానీ అవతార్ క్యారెక్టర్ సృష్టి అనేది ఎప్పటికీ అభిమానుల్లో హాట్ టాపిక్. నీలి మేఘ శ్యాముడైన శ్రీరాముని రూపం ఈ గెటప్ కి స్ఫూర్తి. రాముని రంగు రూపం.. ఆంజనేయుడి తోకను జోడించి అవతార్ రూపాన్ని క్రియేట్ చేశారు జేమ్స్ కామెరూన్. అంటే మన పురాణాలను కామెరూన్ ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే కామెరూన్ సద్వినియోగం చేసుకున్నంతగా శ్రీరాముడిని ఆంజనేయుడిని మన ఫిలింమేకర్స్ ఎవరూ సద్వినియోగం చేసుకోలేదన్నది జగమెరిగిన సంగతి. ఇప్పటికీ క్లాసిక్ డేస్ శ్రీరాముడిని ఆంజనేయుడినే తెలుగు జనం తలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది.
రామాయణం తీస్తామని అంటున్నా ఇన్నాళ్లు ఎవరూ సరైన ప్రయత్నం చేయలేదు. చేసినా మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓం రౌత్ మాత్రం తనకు దక్కిన ఆ ఒక్క ఛాన్స్ వదిలిపెట్టేట్టు లేదు. ఆదిపురుష్ 3డిని రామాయణం స్ఫూర్తితో శ్రీరాముని గెటప్ తో అవతార్ రేంజులోనే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. పండోరా లాంటి ఒక గ్రహాన్ని క్రియేట్ చేస్తాడా లేదా? అన్నది అటుంచితే అవతార్ ని తలపించేలా ప్రభాస్ ని మాత్రం నీల మేఘ శ్యాముడు శ్రీరాముడిలా తీర్చిదిద్దేందుకు అతడు స్కెచ్ లు రెడీ చేశారట. డార్లింగ్ ఇప్పుడు తనలోని పౌరాణిక పాత్రలో తన విశ్వరూపం చూపేందుకు సన్నద్ధం అవుతున్నాడు.
శ్రీరాముడిలా సన్నగా కనిపించేందుకు రూపం మార్చుకోబోతున్నాడు. సన్నగా అంటే భుజ బల సంపన్నుడిగానే కనిపిస్తూ శరీరాకృతిని పూర్తిగా ప్యాకింగులతో సిద్ధం చేస్తాడట. ఓవైపు రాధే శ్యామ్ లోని క్లైమాక్స్ షూట్ లో పాల్గొంటుంటే స్లిమ్ గా మారిపోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నీలి రంగులు అద్దుకున్న రూపంతో ప్రభాస్ అభిమానులకు ఓ రేంజులోనే ట్రీటివ్వబోతున్నాడని అర్థమవుతోంది. 3డి లో భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అనిపించే సినిమాని ప్లాన్ చేశారట. జనవరిలో ఆదిపురుష్ 3డి షూట్ మొదలవుతుంది. 2022 ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినమాని విడుదల చేయనున్నారు.