బాహుబలి బ్యాచ్ పెళ్లిళ్లు చేసుకోరా?

Update: 2017-04-11 04:15 GMT
బాహుబలి మూవీకి సంబంధించినంత వరకూ ఆ మూవీ టీం అనగానే.. రాజమౌళి తర్వాత గుర్తొచ్చేది నలుగురు. ప్రభాస్.. రానా.. అనుష్క.. తమన్నా. ఇంకా సత్యరాజ్.. రమ్యకృష్ణ చేసిన కీలక పాత్రలు ఉన్నా.. ఈ నలుగురు హీరో హీరోయిన్ విలన్ పాత్రధారుల గురించి చెప్పుకుందాం. పైగా వీళ్లందరిలోనూ ఓ కామన్ పాయింట్ కూడా ఉంది. ఎప్పుడు పెళ్లి కబుర్లు వినిపిస్తారా అనే సందేహం.

వీరిలో కూడా తమన్నా ఏజ్ ఇంకా 27 సంవత్సరాలే కాబట్టి.. ఆమెను పక్కన పెట్టేయచ్చు. కానీ మిగతావాళ్లంతా ఇప్పటికే పెళ్లి వయసుదాటిపోతున్న వారే. ప్రభాస్ వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. అనుష్క వయసు 35 సంవత్సరాలు. ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్లుగానే మాటలు వినిపిస్తున్నాయి. బాహుబలి అయ్యాక మ్యారేజ్ విషయం ఎత్తుతాడని అన్నారు కానీ.. అసలు పెళ్లికి-బాహుబలి మూవీకి సంబంధం లేదని తాజాగా సెలవిచ్చారు. ఇక అనుష్క పెళ్లి గురించి అయితే.. ఎన్నెన్నో కబుర్లు-రూమర్లు వినిపించేశాయి. పెళ్లి మాటెత్తితే ప్రభాస్ నవ్వేసి తప్పించుకుంటున్నాడు.. అనుష్క చిర్రుబుర్రులాడి చెక్కేస్తోంది.

ఇక రానా అయితే.. పెళ్లి గురించి అడగితే తనకు ఇంకా ఆలోచనే రాలేదంటాడు. ఇతని వయసు 32 కాబట్టి ఇంకాస్త టైం తీసుకున్నా పర్లేదు. అయినా.. ఈ టీం అంతా బాహుబలికి అన్నేసి ఏళ్లు రాసిచ్చేయడానికి ఇలా స్వేచ్ఛగా ఉండడం కూడా కారణమేనేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News