ఇళ‌య‌రాజా క‌చేరీతో నిధి సేక‌ర‌ణ‌కు ప్ర‌కాష్ రాజ్ హామీ

Update: 2021-09-16 07:31 GMT
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌ధాన పోటీదారులైన మంచు విష్ణు...ప్ర‌కాష్ రాజ్ త‌మ ఎంజెండాను అసోసియేష‌న్ స‌భ్యుల‌తో పంచుకున్నారు. ఓట్ల‌ర‌ని ఆక‌ర్షించుకోవ‌డం కోసం ఒక‌రికి ఒక‌రు పోటీ ప‌డుతూ మ‌రీ పార్టీలిస్తున్నారు. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త పోక‌డ‌ని చూపిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు ధ‌పాల డిన్న‌ర్.. లంచ్..మందు పార్టీలు జ‌రిగాయి. తాజాగా ప్ర‌కాష్ రాజ్ `మా` కోసం ఏకంగా సంగీత దిగ్గ‌జం మాస్ట్రో ఇళ‌య‌రాజా చేత క‌చేరీనే ఏర్పాటు చేయిస్తాన‌ని మాటిచ్చారు. త‌న‌ని గెలిపిస్తే డిసెంబ‌ర్లో ఈ కార్య‌క్ర‌మంగా పెద్ద ఎత్తున ఉంటుంద‌ని అన్నారు.

ఇళ‌య‌రాజాతో ఇప్ప‌టికే మాట్లాడ‌టం జ‌రిగింద‌ని..ఆయ‌న కూడా ఒప్పుకున్నార‌ని విలక్ష‌ణ న‌టుడు తెలిపారు. ఒక క‌చేరీకి ఇల‌య‌రాజా 3 కోట్లు తీసుకుంటారు. కానీ ప్ర‌కాష్ రాజ్ కోసం కోటీ రూపాయ‌ల‌కే క‌చేరి చేయిస్తాన‌మి మాటిచ్చారుట‌. ఆ కోటి కూడా ఎందుక‌ని అడిగితే చిత్ర‌..హ‌రిహ‌ర‌న్ లాంటి సింగ‌ర్ల‌ను తీసుకురావ‌లంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంద‌ని ఇళ‌య‌రాజా త‌న‌తో చెప్పిన‌ట్లు ప్ర‌కాష్ రాజ్ వెల్ల‌డించారు. ఆయ‌న ముందే చిత్ర‌..హ‌రిహ‌ర‌న్ తో ఫోన్ చేసి మాట్లాడార‌ని.. తాను అడిగితే క‌చేరికి ఎందుకు రామ‌నే వాళ్లు కూడా ఉన్నార‌ని ప్ర‌కాష్ రాజ్ తెలిపారు. ఈ క‌చేరి జ‌రిగితే `మా `అసోసియేష‌న్ కి బోలెడంత ఫండింగ్ రూపంలో డ‌బ్బు స‌మ‌కూరుతుంద‌ని తెలిపారు. క‌చేరి త‌ప్ప‌క జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాల‌తో 10 కోట్ల‌తో సంక్షేమ నిధిని సేక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇళ‌య రాజా క‌చేరీల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. దేశ‌..విదేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఎన్నో క‌చేరీలు నిర్వ‌హించారు. సినిమాల క‌న్నా ఆయ‌న ప్ర‌యివేటు క‌చేరీల‌తోనే రెట్టింపు సంపాదిస్తున్నారు. కొన్నేళ్ల‌గా మాస్ట్రో క‌చేరీల‌తోనే బిజీగా ఉంటున్నారు. స్వ‌ర మాంత్రికుడు ఏ. ఆర్ . రెహ‌మాన్ కూడా ఎక్కువ‌గా క‌చేరీలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎన్నో సినిమా అవ‌కాశాల్ని కూడా వ‌దులుకుంటున్నారు.

ఇక‌పోతే మా ఎన్నిక‌ల వార్ లో భాగంగా ప్ర‌కాష్ రాజ్ కి ప్ర‌త్య‌ర్థిగా ఉన్న మంచు విష్ణు నుంచి విధివిధానాల ప్ర‌క‌ట‌న ఎలా ఉంటుందోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది. అత‌డు ఇంత‌కుముందే ఎంతో గ‌ట్సీగా `మా` భ‌వంతిని తానే నిర్మిస్తాన‌ని ఎవ‌రూ డ‌బ్బు సాయం చేయాల్సిన ప‌ని లేద‌ని ప్ర‌క‌టించారు. అంటే దాదాపు 30కోట్ల మేర ఫండ్ ని తానే ఇస్తాన‌ని అత‌డు డేరింగ్ గా ప్ర‌క‌టించారంటూ `మా` స‌భ్యులు ఆనందం వ్య‌క్తం చేశారు. న‌డిగ‌ర సంఘం భ‌వంతిని మించి `మా` బిల్డింగుని నిర్మించేందుకు విష్ణు ముందుకొచ్చార‌ని అంతా భావించారు. అయితే ఇక‌పై ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో విష్ణు ఏం చెబుతారో చూడాలి.

విందుకు విందుతోనే ఢీ

మావీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఎవ‌రికి వారు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. లంచ్ పార్టీలు.. డిన్న‌ర్ పార్టీలు.. మందు పార్టీలు అంటూ మెంబ‌ర్ల ను పార్టీల‌తో ముంచేస్తున్నారు. ప్ర‌ధానంగా పోటీ ప్ర‌కాష్ రాజ్- మంచు విష్ణు ప్యాన‌ల్ మ‌ధ్య నెల‌కొన‌డంతో ఏ వ‌ర్గానికి ఆ వ‌ర్గం మెంబ‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప‌నిలో బిజీ అయ్యారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ జేఆర్ సీ క‌న్వెన్ష‌న్ లో మెంబ‌ర్లంద‌రికీ శ‌నివారం గ్రాండ్ గా లంచ్ పార్టీ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రితో ఇంట‌రాక్ట్ అయ్యారు. దాదాపు 100 మంది వ‌ర‌కూ ఈ విందుకు హాజ‌ర‌య్యారు. లంచ్ అనంత‌రం `మా` సంక్షేమాల‌పై చ‌ర్చించి.. ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అన్నదానిపైనా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. విష్ణు కూడా మంగ‌ళ‌వారం పార్క్ హ‌య‌త్ లో మెంబ‌ర్ల‌కు డిన్న‌ర్ పార్టీ ఏర్పాటు చేసారు. హోట‌ల్ హ‌య‌త్ వేదిక‌గా విష్ణు కూడా మంత‌నాలు సాగించారు. ఉద‌యం నుంచి రాత్రి 10 గంట‌ల‌ వ‌రకూ చ‌ర్చించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News