ఊరు మనకు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగిచ్చేయాలి. లేకపోతే లావైపోతాం... శ్రీమంతుడులోని ఈ డైలాగ్ ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆచరణలో పెడుతున్నారు. తాను దత్తత తీసుకున్నగ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రకాష్ రాజ్. తాజాగా ఆ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
గతంలో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లె ని దత్తత తీసుకున్నారు ప్రకాష్ రాజ్. ఆ గ్రామంలో చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా రంజాన్ పండుగ సందర్భంగా ఒక నిరుపేద ముస్లిం కుటుంబానికి ఇల్లు కట్టించాడీ విలక్షణ నటుడు. అంతేకాదు, స్వయంగా ఆ ఇంటిని తన చేతుల మీదుగా ఓపెన్ చేసి ఆ కుటుంబ సభ్యుల కళ్ళలో ఆనందాన్ని నింపారు.
కొండారెడ్డిపల్లెలో చోటే మియాకు ముగ్గురు కుమార్తెలు. పేదరికంలో ఉన్న చోటే మియా ఇల్లు శిధిలమై పోయినా అందులోనే వాళ్ళు కాపురం ఉంటున్నారు. దీన్ని చూసి చలించి పోయిన ప్రకాష్ రాజ్ ఇంటి నిర్మాణానికి కావాల్సిన మొత్తం డబ్బును తన ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేయించాడు. చాలా మంది నటులకు ఆదర్శంగా నిలిచాడు.
బాలీవుడ్ లో నానా పటేకర్ - అక్షయ్ కుమార్ - వివేక్ ఒబెరాయ్ లాంటి నటులు రైతులకు - అవసరమైన వారికి చేతనైన సాయం చేస్తూనే ఉన్నారు. అయితే, మన టాలీవుడ్ లో మాత్రం అలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో కనిపిస్తారు. ఇలా నటీనటులదరూ తమ స్థోమతకు తగ్గట్టు సమాజ కల్యాణానికి ఖర్చు పెడితే బాగుంటుంది. అయితే, టాలీవుడ్ లో కుర్ర హీరోలు మాత్రం ఈ తనహా సాయం చేయటం లేదన్నది మాత్రం వాస్తవం. ఇకనైనా ఆ దిశగా మన యువ హీరోలు ఆలోచిస్తారని ఆశిద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/