ఆ సినిమాలో ప్రకాష్ రాజే హీరోనా..

Update: 2016-10-14 11:30 GMT
కొంతమందికి కొన్ని పాత్రలు మాత్రమే నప్పుతాయ్. కానీ ఎలాంటి కేరెక్టర్ కైనా జీవం పోసే వారు చాలా అరుదుగా ఉంటారు. అలనాటి మేటి నటుల సంగతి వదిలేస్తే ఈ జనరేషన్లో ఓ పాత్రకి లైఫ్ ఇచ్చేంత గొప్పగా యాక్ట్ చేసే వారు ఎవరున్నారంటే వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అలాంటి లిస్ట్ తీస్తే ముందు కనిపించేది ప్రకాష్ రాజ్ పేరే. విలన్ దగ్గర్నుంచి తండ్రి.. తాత వరకు 30 ఏళ్ల కెరీర్ లో చేసిన సినిమాలే చెబుతాయ్ ప్రకాష్ రాజ్ టాలెంట్ ఏంటో.

చేసే మూవీస్ లో తన పాత్ర పరిధి కన్నా.. ప్రాధాన్యతనే చూస్తారు ప్రకాష్ రాజ్. అంత గ్రేట్ యాక్టర్ కాబట్టే ఈ మధ్య డైరెక్టర్స్ కూడా ప్రకాష్ రాజ్ కోసం హైప్రోఫైల్ రోల్స్ ను స్పెషల్ కేర్ తీసుకోని మరీ డిజైన్ చేస్తున్నారు. ఇక దిల్ రాజు సినిమాల్లో ప్రకాష్ రాజ్ పాత్రకుండే ప్రాధాన్యతే వేరు. అది బొమ్మరిల్లు అయినా.. మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టైనా సరే. ప్రకాష్ రాజ్ నటించలేదు జీవించేశారు. ఇక సతీష్ వేగ్నేశ డైరెక్షన్లో దిల్ రాజు తీస్తోన్న శతమానం భవతిలో కూడా ప్రకాష్ రాజ్ దే కీ రోల్ అనే టాక్ వినిపిస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న శతమానం భవతి తాత- మనవడి రిలేషన్ తో సాగే ఫీల్ గుడ్ మూవీ అని ఈ పాటికే అర్థమైపోయింది. టీజర్ లో కనిపించిన మూడు నాలుగు షాట్లలోనే తన యాక్టింగ్ స్కిల్స్ చూపించి ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. దానికి తగ్గట్టే సినిమా మొత్తం ప్రకాష్ రాజ్ చుట్టూనే తిరుగుతుందట. మరి అంత ఇంపార్టెంట్ ఉన్న కేరెక్టర్ కి ప్రకాష్ రాజ్ కాకుండా ఇంకొకరు ఎలా ఛాయిస్ అవుతారు. ఇప్పటికే గోవిందుడు అందరి వాడేలే మూవీలో రామ్ చరణ్ తాతగా అందరికి గుర్తుండిపోయిన ప్రకాష్ రాజ్ శతమానం భవతి తర్వాత తాత పాత్రలకి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తారేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News