సైమా కోసమని సౌత్ ఇండస్ట్రీ మొత్తం దుబాయ్ లో దిగిపోయింది. రెండు రోజులపాటు స్టార్స్ అంతా ఆటపాటలతో ఎంజాయ్ చేసొచ్చారు. ఆ ఫంక్షన్ దెబ్బకి టాలీవుడ్ అయితే వెలవెలబోయింది. అగ్ర తారలంతా అక్కడే దిగిపోవడంతో దుబాయ్ లోని తెలుగు ప్రేక్షకులు పట్టరాని సంతోషంతో ఊగిపోయారు. ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే స్టార్స్ కూడా అంతా ఒకచోటకి చేరి సరదా సరదాగా గడిపారు. కథానాయికలైతే ఫ్యాషన్ టాలెంట్ నీ, గ్లామర్ నీ ప్రదర్శించడానికి ఓ పెద్ద స్టేజీ దొరికిందని రెచ్చిపోయారు. అందచందాలతో కెమెరాలకి పనిపెట్టారు. మరికొద్ది మంది మాత్రం డ్యాన్సులు చేసి ఇరగదీశారు. ఈసారి పూజా హెగ్డే, ప్రణీత, అమలాపాల్ లాంటి హీరోయిన్లు డ్యాన్సులేసి దుమ్ము దులిపారు. తెలుగువాళ్ల దృష్టి లో బాపుబొమ్మగా ముద్రపడ్డ ప్రణీత సైమా ఫంక్షన్ కే హైలెట్టయ్యిందట. తొలి రోజు స్టేజీ పై డ్యాన్స్ ఇరదీసిందట. మలిరోజు రెడ్ డ్రెస్ వేసుకొని అదుర్స్ అనిపించిందట. ఆమె అందం చూసి కుర్రహీరోలు సైతం ఫిదా అయిపోయారని తెలిసింది. పూజాహెగ్డే కి ఇదే తొలి లైవ్ పెర్ ఫార్మెన్స్ . అయినప్పటికీ ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా డ్యాన్సులు వేసిందట.
ఇక కథానాయకుల విషయానికొస్తే వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సందడికైతే హద్దే లేదట. వాళ్లు స్టేజీ పై ఆటపాటలతో దుమ్ము దులిపేసినట్టు తెలిసింది. అల్లు అర్జున్ కి యూత్ ఐకాన్ పురస్కారం లభించినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తోపాటు ఆయన తమ్ముడు శిరీష్, తండ్రి అల్లు అరవింద్ కూడా వేడుకకి హాజరయ్యాడు. టాలీవుడ్ లో ఇటీవలికాలంలో కనిపించని భూమిక, దీక్షాసేథ్ లాంటి కథానాయికలు కూడా సైమాకి హాజరయ్యారు. ఈమధ్య కాలంలో సినిమాల పరంగా జరిగిన అతి పెద్ద ఈవెంట్ అంటే దుబాయ్ సైమా అనే చెప్పొచ్చు.