సుధీర్ బాబు - ఆనంది హీరోహీరోయిన్లుగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన రూరల్ యాక్షన్ డ్రామా ''శ్రీదేవి సోడా సెంటర్''. 70 mm ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా సమాజంలోని అంతరాలు, కుల వ్యవస్థ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'కేజీయఫ్' 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడారు. ''నా ప్రియమైన స్నేహితుడు విజయ్ చిల్లా సినిమా గురించి గొప్ప విషయాలు వింటున్నాను. డైరెక్టర్ కరుణ కుమార్ తో పాటు 'శ్రీదేవి సోడా సెంటర్' మొత్తం బృందానికి నా అభినందనలు. హీరో సుధీర్ బాబు అద్భుతంగా కనిపిస్తున్నారు'' అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఇకపోతే సుధీర్ బాబు బావ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 'శ్రీదేవి సోడా సెంటర్' పై ప్రశంసల వర్షం కురిపించారు.
శుక్రవారం సాయంత్రం స్పెషల్ గా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేష్.. ట్విటర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ''హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో రూపొందిన రా అండ్ ఇంటెన్స్ ఫిలిం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ తర్వాత డైరెక్టర్ కరుణ కుమార్ మరోసారి చేసిన బోల్డ్ ఫిలిం ఇది. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకూ చేసిన వాటిలో బెస్ట్ పెరఫార్మన్స్ ఇది. నరేష్ మరోసారి తన నటనతో మెప్పించారు. హీరోయిన్ ఆనంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శ్రీదేవి పాత్రకు ఆమె పర్‌ఫెక్ట్ గా సరిపోయారు. బ్రిలియంట్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిగిన ఈ చిత్రాన్ని మిస్ కాకండి. చిత్ర బృందం మొత్తానికి మరోసారి నా అభినందనలు'' అని మహేష్ ట్వీట్ చేశారు.
కాగా, 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్ - సత్యం రాజేష్ - రఘుబాబు - అజయ్ - హర్షవర్ధన్ - సప్తగిరి - రోహిణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.