సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో 'ప్రేమించుకుందాం రా'!

Update: 2022-05-11 12:30 GMT
విక్ట‌రీ వెంక‌టేష్‌-అంజ‌లి జావేరి నాయ‌కా నాయిక‌లుగా జయంత్ సి. ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన  'ప్రేమించుకుందా రా' సినిమా అప్ప‌ట్లో  ఎంత పెద్ద హిట్ అయిందో  చెప్పాల్సిన ప‌నిలేదు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్ లో సాగిన ల‌వ్ స్టోరీ ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. వెంకీ కెరీర్ లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది.

రిలీజ్ కి ముందు మ్యూజిక‌ల్ గానూ  పెద్ద  సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. 50కి పైగా సెంట‌ర్ల‌లో సెంచ‌రీ కొట్టింది. 57 సెంట‌ర్ల‌లో  50 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా గా రికార్డు సృష్టించింది. అప్ప‌టివ‌ర‌కూ  ఎన్నో  తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అర్ధ శ‌త‌దినోత్స‌వం 50 సెంట‌ర్ల‌కే ప‌రిమితం.  ఆ రికార్డుని ప్రేమించుకుందాంరా' 57 సెంట‌ర్ల‌తో బ్రేక్  చేసింది.

తాజాగా ఈ సినిమా ఈ ఏడాదితో  25 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్ని ఘ‌నంగా జ‌రుపుకుంది. చిత్ర ద‌ర్శ‌కుడు జ‌యంత్ . సి. ప‌రాన్జీ త‌న ఇన్ స్టా ప్రోపైల్ లో 'రీయూనియ‌న్ మ్యాడ్ నెస్ ఎట్ హోమ్' అనే క్యాప్ష‌న్ ఇచ్చారు.

అలాగే టీమ్  మీట్ కి సంబంధించిన వీడియోని అభిమానుల‌కు షేర్ చేసారు. ఆ సినిమాకు ప‌నిచేసిన వారంతా ఏక‌మై కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు.

వెంక‌టేష్ కేక్ క‌ట్  చేసి షాంపైన్ బాటిల్ ని ఓపెన్ చేసి సెల‌బ్రేషన్  షురూ చేసారు. లిటిల్ హార్ట్ బిస్కెట్ ప్యాకెట్ కూడా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ సినిమా టైమ్ లో ఆ బ్రాండ్ బిస్కెట్ ప్యాకెట్ బాగా పాపుల‌ర్ అయింది. వేడుక‌లో భాగంగా మోహ‌న్ బాబు.. బెనర్జీ..హేమ‌..వి.ఎన్ ఆదిత్య మ‌రి కొంతమంది సినీ ప్ర‌ముఖ‌లు పాల్గొన్నారు.

అంతా పార్టీ ఎంజాయ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ వేడుక‌లో  నిర్మాత‌ సురేష్ బాబు  మిస్ అయ్యారు. వీడియో కాల్ ద్వారా త‌న సంతోషాన్ని టీమ్ తో పంచుకున్నారు. జ‌యంత్ సి ఆరు వీడియోలు షేర్ చేసినా ఆయ‌న  పెద్ద‌గా ఏం మాట్లాడ‌లేదు. 'ఐల‌వ్ యూ అని..థాంక్యూ' మాత్ర‌మే చెప్పారు. ఈ చిత్రాన్ని  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్  నిర్మించింది. మ‌హేష్ మ‌హ‌దేవ‌న్ సంగీతం అందించారు.
Tags:    

Similar News