రోకా పూర్తి.. పెళ్లి సెప్టెంబ‌ర్‌ లో..

Update: 2018-08-19 01:30 GMT
గ‌త కొంత‌కాలంగా ముంబై వ‌ర‌ద‌ల్ని మించి ఎక్కువ‌గా ప్ర‌చారం పొందిన ఏకైక టాపిక్ ఏది? అంటే అది.. పీసీ డేటింగ్ వ్య‌వ‌హారం. ఈ అమ్మ‌డు లండ‌న్ బోయ్ నిక్ జోనాస్‌ తో ప్రేమ‌లో ప‌డిన‌ప్ప‌టినుంచి నేడు రోకా (నిశ్చితార్థం) పూర్త‌య్యేవ‌ర‌కూ ఎన్నో ఇన్సిడెంట్స్‌. గ‌తేడాది ఆ ఇద్ద‌రూ విదేశాల్లో మెట్‌ గాలా ఈవెంట్ లో క‌లుసుకున్నారు. అటుపై ప్రేమలో ప‌డిపోయి డిన్న‌ర్ డేట్‌ ల‌తో చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేశారు. ఆ క్ర‌మంలోనే లండ‌న్‌లో ఆ జంట నిశ్చితార్థం పూర్త‌యింద‌న్న వార్త‌లు వినిపించాయి. అప్పుడే ఇండియాలో రోకా వేడుక‌ను సెల‌బ్రేట్ చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిందిట‌.

ఎట్ట‌కేల‌కు నేడు పీసీ - నిక్ జోనాస్ నిశ్చితార్థం (రోకా శిరోమ‌ణి) కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పూర్త‌యింది. ఇటు పీసీ ఫ్యామిలీ. అటు నిక్ ఫ్యామిలీ.. రోజంతా ఒక‌టే సంబ‌రాలు. ముంబైలోని ఖ‌రీదైన స్టార్ హోట‌ల్లో 200 రూమ్‌లు బుక్ చేసి మ‌రీ ఈ వేడుక‌ను నిర్వ‌హించారు. ఇన్ని రూమ్‌ల‌కు స‌రిప‌డా లండ‌న్ నుంచి అతిధులు దిగొచ్చార‌ట‌. పీసీ త‌ర‌పునుంచి మాత్రం ఈ వేడుక‌కు కేవ‌లం కొద్దిమంది బంధు మిత్రులు మాత్ర‌మే ఎటెండ్ అయ్యారు. ఇందులో స‌ల్మాన్ ఖాన్ సోద‌రి అర్పితా ఖాన్‌, ప‌రిణీతి చోప్రా త‌దిత‌రులు ఉన్నారు. ఈ ఈవెంట్ అంతా పూర్తి ప్ర‌యివేట్ ఎఫైర్‌లా చేశారంతే. ఇక ఈ రోకా ఈవెంట్‌లో పెళ్లి లోగో వేడుక‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ లోగోలో ఎన్‌పి అక్ష‌రాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో ప‌చ్చ‌ద‌నం అభిమానుల క‌ళ్ల‌కు బ్రాండ్ లాగా క‌నిపించాయి.

మొత్తానికి పీసీ ఓ ఇంటిదైపోయిన‌ట్టే ఇక‌. రోకాతో మిస్ట‌ర్ అండ్ మిసెస్ జోనాస్‌ గా మారిపోయింది. వాస్త‌వానికి లండ‌న్ నిశ్చితార్థంతోనే ఈ జంట ఒక‌ట‌య్యారు. అయితే ఇండియాలో నేటి ఈవెంట్ త‌ర్వాత‌నే మ‌న‌వాళ్ల‌కు పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. ఇక పెళ్లి అక్టోబ‌ర్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది. కేవ‌లం కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలోనే పీసీ సీన్ మొత్తం మారిపోయింది. బ్రిట‌న్ రాకుమారుడిని పెళ్లాడేస్తూ ఓ ఇంటిదైపోతోంది.
  


Tags:    

Similar News