తెలుగు వెర్షన్ `బిగ్ బాస్` పై విమర్శలు..వివాదాలు కొత్తేం కాదు. మొదటి సీజన్ మొదలైన నాటి నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. కంటెంస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి విన్నర్ ఎవరో తేలేవరకూ అందులో టాస్క్ లు...వివాదాలు ఓ సెక్షన్ ఆడియన్స్ కి రోధనగానే కనిపిస్తున్నాయని విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. సహనం కోల్పోయిన కొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వివిధ రూపాల్లో చాటే ప్రయత్నం చేస్తున్నారు.
కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తే మరికొంత మంది నెగిటివ్ గా రిప్లై ఇస్తున్నారు. ఇటీవలే సీఐపీ పార్టీ నారాయనణ బిగ్ బాస్ ని సెట్ ని `బ్రోతల్ హౌస్` అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాగార్జునను నాగన్నా నాగన్నా అనడం.. బిగ్ బాస్ లోకి వచ్చిన వాళ్లంతా అదే టైప్ అంటూ నిప్పులు చెరిగారు. తాజాగా నటుడు..నిర్మాత త్రిపురనేని చిట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
చిట్టి ఏకంగా నాగార్జున కుటుంబాన్నే టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసారు. `బ్రోతల్ హౌస్ అని నారాయణ వాడిన భాష తప్పు కానీ భావం మాత్రం కరెక్టే. బూతు అంటే విప్పి చూపించడమే కాదు. పబ్లిక్ రొమాన్స్ కూడా బూతే. నాలుగు గోడల మధ్య వ్యవహారాన్ని పబ్లిక్ గా చూపిస్తానంటే బూతు కాక మరేం అవుతుందని ప్రశ్నించారు.
నిజమైన వ్యక్తిత్వాన్ని తీయడం షో అజెండా. కానీ ఆ ఇంట్లో ఏం జరుగుతోందా అంతా చూస్తూనే ఉన్నారు. ఒకే మంచం మీద ఇద్దరు పడుకుంటారు. ఎగిరెగిరి ముద్దులు పెట్టుకుంటారు. ఇవన్నీ పబ్లిక్ రొమాన్స్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో ఇదంతా ఏమిటి? ఇలాంటి కార్యక్రమాన్ని నాగార్జునలాంటి వ్యక్తి ప్రోత్సహించడం దురదృష్టకరం.
ఆయన ఎలా ఆలోచిస్తున్నారో అర్ధం కాలేదు. సెట్ లోకి జంటగా వెళ్లిన భార్యాభర్తలు రోహిత్-మెరీనాలు మీకు లైసెన్స్ ఉంది. హగ్ చేసుకోండి. ముద్దులు పెట్టుకోండి అని డైరెక్ట్ గానే చెబుతున్నాడు. అంటే పెళ్లైన వాళ్లు పబ్లిక్ ఎలాంటి పనులైనా చేయోచ్చా? ఆయనకు పెళ్లైంది. లైసెన్స్ ఉంది. వాళ్ల భార్యను తీసుకొచ్చి బయట రొమాన్స్ చేస్తాడా? నలుగురిలో గౌరవంగా ఉండే నాగార్జున బిగ్ బాస్ లో ఉన్న వాళ్లని పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోమంటారా? ఇలాంటివి తగ్గించుకకపోతే జనాలు తిరగబ డతారు.
బిగ్ బాస్ లో అసభ్యత కళ్ల ముందు కనిపిస్తుంది. నారాయణ మాటల్లో తప్పేం లేదు. ఇలాంటి వాటిని బ్చాన్ చేయాలి ` అని మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యల్ని నెటిజనులు తప్పుబడుతున్నారు. ఎంటర్ టైన్ మెంట్ ని ఆస్వాదించడం ఆయనకు తెలియక ఏవేవో మాట్లాడుతున్నాడు. నీకు నచ్చకపోతో షో చూడం మానేయ్. అసలు నీ వయసెంత? ఈ వయసులో ఇలాంటివన్నీ అవసరమా? నాగార్జున ని నిందించడం లో తప్పు లేదు. ఆయన భార్య అమలని ఇందులోకి తీసుకురావడం ఏంటి? వార్తల్లో ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దంటూ నెటి జనులు చిట్టిపై భగ్గుమంటున్నారు.