పూరి జగన్నాథ్ దర్శకుడే కాదు, నిర్మాత కూడా. ఐతే ఎక్కువగా తాను దర్శకత్వం వహించిన సినిమాల్నే నిర్మించాడు పూరి. ఒక్క ‘హలో ప్రేమిస్తారా’ సినిమాను మాత్రమే వేరే దర్శకుడితో నిర్మించాడు. అది చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఐతే ఈ మధ్య తన దర్శకత్వంలో కూడా సినిమాలు నిర్మించడం మానేశాడు. వేరే నిర్మాతలకే సినిమాలు చేస్తున్నాడు. ఐతే మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు పూరి. ఐతే ఆ సినిమాకు దర్శకుడు పూరి కాదు. ఆ మూవీకి ఓ లేడీ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతుండటం విశేషం. ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి రేవతి.
రేవతి దర్శకురాలిగా మారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన సినిమాలు చేశారు. మిత్ర్, ఫిర్ మిలేంగే, కేరళ కేఫ్, ముంబయి కటింగ్, రెడ్ బిల్డింగ్ లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. అవార్డులు కూడా అందించాయి. ఇప్పుడామె పూరి నిర్మాణంలో ఓ సినిమా చేయబోతోందట. వరుణ్ తేజ్ తో పూరి చేస్తున్న కొత్త సినిమా ‘మా అమ్మ సీతామాలక్ష్మి’లో రేవతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రేవతి ఆలోచనలు విన్న పూరి చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఓ కథ ఆయనకు బాగా నచ్చేసి స్వయంగా నిర్మించడానికి ముందుకొచ్చాడట. షూటింగ్ పూర్తయ్యేలోపు ప్రాజెక్టు ఓకే అయిపోయిందట. త్వరలోనే ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పట్టాలెక్కబోతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.