ఇండియాపై పాక్ గెలిస్తే విప్పేస్తుందట..

Update: 2016-03-15 10:08 GMT
భారత్ లోనే కాదు.. పాకిస్థాన్ లోనూ పూనమ్ పాండేలున్నారన్నమాట. 2011 ప్రపంచకప్ టీమ్ఇండియా గెలిస్తే బట్టలిప్పేసి నగ్న ప్రదర్శన చేస్తానని పూనమ్ అప్పట్లో సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే ఇండియా గెలిచినా పూనమ్ మాట నిలబెట్టుకోలేదనుకోండి. ఆ సంగతలా వదిలేస్తే.. ఈ రోజే ఆరంభం కాబోతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ శనివారం ఇండియా - పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ప్రపంచకప్ లో ఇప్పటిదాకా ఇండియాపై గెలిచిన చరిత్రే లేదు పాకిస్థాన్ కు. దీంతో ప్రపంచకప్ గెలవడం కంటే ఇండియాపై గెలవడం పాకిస్థానీయులకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే పూనమ్ పాండే తరహాలో ఓ పాకిస్థానీ మోడల్ సంచలన ప్రకటన చేసింది. ఈ శనివారం భారత జట్టను పాకిస్థాన్ ఓడిస్తే.. పాక్ ప్రజల ముందు తాను స్ట్రిప్ డ్యాన్స్ (ఒంటిపై ఉన్న బట్టలు ఒక్కోటి విప్పుతూ చేసే డ్యాన్స్) చేస్తానని ప్రకటించింది కాందీల్ బాలోచ్ అనే మోడల్. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో వీడియోను పోస్ట్ చేసింది కాందీల్. పాక్ జట్టు గెలిస్తే తాను కచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని.. ఆ స్ట్రిప్ డ్యాన్స్ వీడియోను పాక్ జట్టు కెప్టెన్ అఫ్రిదికి అంకితమిస్తానని ఆమె పేర్కొంది. మరి కాందీల్ ఇచ్చిన స్ఫూర్తితోనైనా పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాస్తుందేమో చూడాలి. ఒకవేళ పాక్ గెలిస్తే కాందీల్ మాట నిలబెట్టుకుంటుందా.. పూనమ్ లాగా హామీని తుంగలో తొక్కేస్తుందా?
Full View

Tags:    

Similar News