ఫోటో టాక్‌: బ‌్యూటీ `బ‌జార్` పాలు

Update: 2019-01-06 03:30 GMT
వివాదాల‌తో నిరంత‌రం వేడెక్కించించే ముంబై బ్యూటీ రాధికా ఆప్టే. మ‌న‌సులో ఏం ఉన్నా దాచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఈ హాటీ గ‌త ఏడాది ప‌లు వివాదాల‌తో అంట‌కాగింది. పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌కు జ‌రిగిన అన్యాయాల గురించి ప‌లు వేదిక‌ల‌పై నిరభ్యంత‌రంగా మాట్లాడింది. మీటూ ఉద్య‌మంలో ప‌లువురు అబ‌ల‌ల‌కు స‌పోర్టుని అందించి హాట్ టాపిక్ అయ్యింది. వీలున్న‌ప్పుడు త‌న వ్య‌తిరేకుల పైనా విరుచుకుప‌డే ఈ భామ క్వీన్ కంగ‌న‌కు వార‌సురాలిగానూ పేరు తెచ్చుకుంది.

అదంతా అటుంచితే రాధిక ఆప్టే `ల‌స్ట్ స్టోరీస్`(2018) ల‌ఘుచిత్రంలో  వేడెక్కించే పెర్ఫామెన్స్‌ ఇప్ప‌టికీ కుర్ర‌కారులో హాట్ టాపిక్. ల‌ఘు చిత్రాల‌తో, వెబ్ సిరీస్ ల‌తో వేడి పెంచుతూ నిరంత‌రం నెటిజ‌నులకు ట‌చ్ లో ఉంటోంది. అప్పుడ‌ప్పుడు ఫోటోషూట్లు త‌న‌ని లైమ్ లైట్ లో ఉంచుతున్నాయి. భారీ చిత్రాల్లో అవ‌కాశాలు లేక‌పోయినా మ‌ధ్య‌స్త బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కే చిత్రాల‌కు రాధిక ఒక ఆప్ష‌న్ గా వెలుగొందుతోంది. వేర్ ఈజ్ రాధిక ఆప్టే? అంటూ ఈ భామ‌పై కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల వేళ ఓ హాట్ డిబేట్ కూడా ఆన్ లైన్ లో ర‌న్ అయ్యింది.

తాజాగా `బ‌జార్‌` మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై క‌నిపించి వేడి పెంచింది. బ్లాక్ టాప్, నాచురంగు బాట‌మ్ ప‌రికిణీలో ఈ బ్యూటీ అందాల ఎలివేష‌న్ హాట్ టాపిక్. రాధిక‌లో సెక్స‌ప్పీల్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఈ కొత్త‌ లుక్ చెబుతోంది. ప్ర‌స్తుతం ఈ క‌వ‌ర్ ఫోటో వేగంగా వైర‌ల్ అయిపోతోంది. ఇక‌ కొత్త సంవ‌త్స‌రంలో రాధిక ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అంటే కెరీర్ ప‌రంగా చూస్తే `బొంబార్జియాన్`, `చైత్ర‌మ్ ప‌సుతాడి 2` (త‌మిళం), ది వెడ్డింగ్ గెస్ట్ వంటి చిత్రాలు ఆన్ సెట్స్ ఉన్నాయి. `ది ఆశ్ర‌మ్‌` అనే ఆంగ్ల చిత్రంలోనూ రాధిక ఆప్టే న‌టిస్తోంది. ఇవ‌న్నీ రిలీజ్ ల‌కు రావాల్సి ఉందింకా.






Full View
Tags:    

Similar News