బాహుబలి 1 రికార్డుల వేట సాగుతూనే ఉంది. ఇంతలోనే సీక్వెల్ కోసం రంగం సిద్ధమవుతోంది. బాహుబలి : ది కన్ క్లూజన్ కోసం కసరత్తు మొదలైంది. నవంబర్ నుంచి ఆన్ సెట్స్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అయితే తెలుగు సినీపరిశ్రమలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ రెండో పార్ట్ మార్కెటింగ్ ని పూర్తి చేయాలని ఇన్నోవేటివ్ పద్ధతుల్ని అనుసరించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇంతకాలం ఏదైనా సినిమా తెరకెక్కాలంటే ముందుగా ఫైనాన్సియర్ల వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చేది. బాహుబలి : ది బిగినింగ్ కోసం అలానే చేశారు. మీడియా దిగ్గజం రామోజీరావు బాహుబలి కోసం భారీగా పెట్టుబడులు పెట్టారని వార్తలొచ్చాయి. అయితే ఈసారి మాత్రం మునుపటి ఫార్ములాలోనే వెళ్లాలనే ఆలోచనలో రాజమౌళి - శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్ అండ్ బృందం లేనేలేరని తెలుస్తోంది. బాహుబలి 2 డీల్ ముందే పూర్తి చేయాలి. బిజినెస్ మొత్తం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలి. దీనికోసం అప్పు చేయకూడదు. వడ్డీలు తడిసిమోపెడవ్వకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం కార్పొరెట్ దిగ్గజాల్ని ఆకర్షించి ముందే పెట్టుబడులు దక్కేలా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో ఆ రేంజులో వందల కోట్లు పెట్టుబడులు పెట్టే వాళ్లెవరున్నారు? అందుకే బాలీవుడ్ కార్పొరెట్ దిగ్గజాల్ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.
మొదటి భాగం హిట్టయ్యింది కాబట్టి అట్నుంచి కూడా పాజిటివ్ స్పందన వస్తోందని తెలుస్తోంది. ఏదైమైనా మార్కెటింగ్ పరంగా ఇదో కొత్త స్ర్టాటజీ. టాలీవుడ్ లో మునుపెన్నడూ కనిపించనిది, వినిపించనిది. ఈ ప్లాన్ వర్కవుటైతే రాజమౌళి నుంచి ఏలియన్స్ - ప్రిడేటర్స్ - అవతార్ - గాడ్జిల్లాల్ని కొట్టే సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డబ్బు పెట్టేవాడు ఉంటే దమ్ము ఉంది జక్కన్నలో. వెయిట్ అండ్ సీ..