టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ప్రకటన వచ్చి సంవత్సరం దాటింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో జక్కన్న మూవీ తెరకెక్కబోతుందని సంవత్సరం క్రితం వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎట్టకేలకు ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్లుగా సమాచారం అందుతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలో సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కథానుసారంగా ఈ చిత్రంలో ఒక ఫారిన్ ముద్దుగుమ్మ కూడా ఉండబోతుందట. ఇంటర్వెల్ సీన్స్ లో ఆ ఫారిన్ ముద్దుగుమ్మతో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటించనున్నారట. కేవలం ఇంటర్వెల్ కు ముందు సీన్స్ ను 45 రోజుల పాటు చిత్రీకరించేందుకు జక్కన్న ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏడు నుండి 10 నిమిషాల సీన్స్ ను 45 రోజుల పాటు చిత్రీకరించబోతున్న జక్కన్న సినిమా మొత్తాన్ని ఏ రేంజ్ లో చిత్రీకరించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
సినిమాకు చాలా కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ను అద్బుతంగా చిత్రీకరించేందుకు జక్కన్న ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడట. ఇద్దరు హీరోలు కూడా ఇంటర్వెల్ ముందు కలవడమో లేదంటే మరేదైనా కీలక పరిమాణం జరుగుతుందేమో అనిపిస్తుంది. అందుకే ఇంటర్వెల్ ముందు సీన్స్ ను జక్కన్న చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభించి 2020లో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదో పీరియాడిక్ చిత్రం అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై సినిమా ఫస్ట్ లుక్ వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. జక్కన్న ఏ నేపథ్యంతో తీసినా కూడా సినిమా రచ్చ చేయడం ఖాయం అంటూ అప్పుడే సినీ జనాలు - ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారు.