జక్కన్న రంగంలోకి దిగాడు. బాహుబలి 2 పనుల్ని షురూ చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ - విఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ పీట్ డ్రేపర్ తో కలిసి కొత్త సెట్స్ గురించి రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రణాళికలు రచిస్తున్నాడు రాజమౌళి. మంగళవారం నుంచే ఆ పనులు మొదలెట్టారు. నిజానికి అంతర్గతంగా ఎప్పట్నుంచో వ్యూహాలు రచిస్తున్నారు. రాజమౌళి ఎక్కడున్నా సరే... తన టీమ్ తో సంప్రదింపులు జరుపుతూ బాహుబలి 2 పనుల్ని పర్యవేక్షిస్తూ వస్తున్నాడు. ఇన్నాళ్లూ ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయి. అవన్నీ ఓ కొలిక్కి రావడంతో ఇప్పుడు రంగంలోకి దిగేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అదనంగా కొన్ని కొత్త సెట్లు తీర్చిదిద్దాక చిత్రీకరణ మొదలుపెడతారని తెలుస్తోంది. వచ్చే నెలలోపు ఆ సెట్స్ రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాహుబలి సంచలన విజయం సాధించడంతో బాహుబలి 2పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాని తీయాలనుకొంటున్నాడు రాజమౌళి. అందుకే మరింత భారీ హంగులతో కొత్త సినిమాని తీర్చిదిద్దబోతున్నట్టు తెలుస్తోంది. బాహుబలికి భారీగా లాభాలు వచ్చాయి కాబట్టి, బడ్జెట్ ప్రాబ్లెమ్ కూడా లేదు కాబట్టి రాబోయే సినిమా మరింత గ్రాండ్‌గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి 2 కోసం ఇప్పటికే బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు గుత్తగా రైట్స్ ని తీసుకొనేందుకు సిద్ధమవుతున్నాయి. డబ్బును కూడా ముందస్తుగానే చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కార్పొరేట్ కంపెనీలకు రైట్స్ ని ఇవ్వకుండా తొలి సినిమాలాగే వ్యాపారం చేస్తున్నారు.