టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ రకూల్ ప్రీత్ సింగ్ అడ్డంగా బుక్కయిపోయింది. అందునా దేశం కాని దేశం లండన్ లో దారి తెలియక దిక్కు తోచని పరిస్థితిలో ఇరుక్కుపోయంది. హారిబుల్ .. ఆ మినిట్ డెత్ సెంటెన్స్ అనిపించేంతటి ట్రబుల్ .. ఈ ఇన్సిడెంట్. ఓసారి డీటెయిల్స్ లోకి వెళదామా..
ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలోని మా నాన్నకు ప్రేమతో షూటింగ్ లండన్ లో సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాయకానాయికలు సహా ఇతర నటీనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అందునా హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ పై కార్ డ్రైవింగ్ సీన్. ఓ టాప్ లెస్ కార్ లో హీరోయిన్ అలా అలా లండన్ వీధుల్లో శికారు చేయాలి. ఆ సన్నివేశంలో తనతో పాటే వేరే యూనిట్ సభ్యులెవరూ ఉండరు. ఓ కార్, దాని స్టీరింగ్ ముందు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కవర్ చేయడానికి ఓ కెమెరా సెటప్. రకూల్ తో పాటే ఓ వాకీ టాపీ తప్ప ఇంకేమీ లేదు. సరే వెళ్లొస్తానని చెప్పి కార్ డ్రైవ్ చేసుకుంటూ వీధుల్లోకి వెళ్లింది. అలా వెళ్లి ఇలా లెఫ్ట్ యూటర్న్ తీసుకోవాలంతే. కానీ ఆ టర్న్ రాంగ్ టర్న్ అయ్యింది. చెప్పిన యూటర్న్ మిస్ చేసి ఎటో వెళ్లిపోయింది.
ఫోన్ దగ్గర లేదు. ఎవరి నంబరూ తన దగ్గర లేదాయె. ఓ పక్క వాకీ టాకీ సిగ్నల్ మిస్. ఇంకేం ఉంది.. అడ్డంగా బుక్కయిపోయా. పాదచారుల్ని సాయం అడిగా. తిరిగి షూటింగ్ స్పాట్ కి వెళ్లడానికి ఎంతగానో ఆత్ర పడిపోయా. కానీ లాభం లేకపోయింది. ఎవరూ ఆదుకోలేకపోయారు. ఓ గంట తర్వాత వాకీ టాకీ సిగ్నల్ వచ్చింది. అప్పటికి ఛేజ్ చేసుకుని వచ్చిన యూనిట్ తో కలిసి తిరిగి వెళ్లాను.. అంటూ ఓ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది. హారిబుల్ గా లేదూ?