చెర్రీ మెత్తగా అంటించేశాడు..

Update: 2015-10-14 18:49 GMT
బ్రూస్ లీ ది ఫైటర్ మూవీని పోస్ట్ పోన్ చేసుకోవాలన్న దాసరి కామెంట్స్ కి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించాడు. ఇప్పటివరకూ సైలెన్స్ మెయింటెయిన్ చేసిన చెర్రీ.. ఇప్పుడు నేరుగానే స్పందించాడు. ప్రమోషన్ కార్యక్రమాల కోసం టీవీలకు ఇంటర్వ్యూలకు ఇస్తుండడంతో.. ఈ ప్రశ్న నేరుగానే ఎదురవుతోంది చరణ్ కి. అయితే.. వివాదానికి చాలా దూరంగా, సింపుల్ అండ్ స్ట్రయిట్ గా అన్సర్ ఇచ్చేస్తున్నాడు చరణ్. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడే పండగ, ప్రత్యేకించి పండుగలకు రిలీజ్ చేయాల్సిన పని లేదన్న దాసరి మాటకు.. వినడానికి ఇలాంటివి చాలా బావుంటాయన్నాడు చెర్రీ.

"ఆగడు రిలీజ్ సమయంలో ఆ యూనిట్ మాతో మాట్లాడ్డంతో.. మేం గోవిందుడు అందరివాడే చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాం. బాహుబలి, శ్రీమంతుడు, కిక్2 విషయాల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగింది. కానీ.. బ్రూస్ లీ అక్టోబర్ 16న రిలీజ్ అవుతుందని తెలిసినా.. ఎవరూ మమ్మల్ని పోస్ట్ పోన్ గురించి అడగలేదు. మధ్యలో డేట్ ఉండడంతో.. వాళ్లే రిలీజ్ డేట్ సెట్ చేసుకున్నారు." అని చెప్పాడు చరణ్.

చరణ్ చెప్పిన ఆన్సర్ సింపుల్ గానే ఉంది కానీ.. అందులో చాలా అర్ధం ఉంది. మమ్మల్ని అడిగుంటే ఆలోచించేవాళ్లం అని ఇన్ డైరెక్టుగానే చెప్పాడని అర్ధమవుతుంది. లేదా కలిసి కూర్చుని మాట్లాడుకుని ఫైనల్ చేసుకునేవాళ్లు. అలాగే దాసరి చరణ్ ను, బ్రూస్ లీని నేరుగా ప్రస్తావిస్తే... చరణ్ మాత్రం చాలా హంబుల్ గా అటు దాసరి, ఇటు రుద్రమదేవి పేర్లను ప్రస్తావించకుండానే మొత్తం మాట్లాడేశాడు. మెగా పవర్ స్టార్ మెత్తగా చురకలు అంటించేస్తున్నాడే !

Tags:    

Similar News