ఆమెతో చరణ్‌.. మూడోస్సారి

Update: 2017-11-25 06:57 GMT
టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కరెక్ట్ గా కుదిరితే ఇక వారి నెక్స్ట్ సినిమాల అంచనాలకు హద్దే ఉండదు. అప్పట్లో ఎక్కువగా హిట్ ఫెయిర్ లు కంటిన్యూ అవుతూ ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు ఒకసారి నటించిన హీరోయిన్ తో మారోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్ట పడటం లేదు. కానీ ఒక్క హీరో మాత్రం బలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత చిత్రం బోయపాటి శ్రీను తో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. రీసెంట్ గా సినిమా పూజా కార్యక్రమాలు కూడా సింపుల్ గా స్టార్ట్ అయ్యాయి. అయితే ఆ సినిమాలో రకుల్ ప్రీత్ కౌర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. ఇంతకుముందు రకుల్ చరణ్ తో బ్రూస్ లీ- ధృవ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే అందులో బ్రూస్ లీ డిజాస్టర్ అవ్వగా దృవ మాత్రం బంపర్ హిట్ అయ్యింది. రిజల్ట్ ఎలా ఉన్నా రెండు సినిమాల్లో వారి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా సెట్ అయ్యింది. దీంతో మరోసారి కూడా కలిసి హిట్ కొట్టాలని చూస్తోంది ఈ కాంబో. ఇక బోయపాటి కూడా రకుల్ తో సరైనోడు జయ జానకి నాయక  సినిమాలు చేశాడు. ఇక ఈసారి కూడా అమ్మడు ఒకే అయితే దర్శకుడితో హీరోతో ముచ్చటగా మూడవసారి చేసినట్టే.
Tags:    

Similar News