బోయపాటి బ్రాండ్ చరణ్ యాక్షన్

Update: 2018-06-17 07:18 GMT
మాస్ సినిమాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడంలో బోయపాటి శీను తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా స్టార్ హీరో అయితే శీను రచ్చ మామూలుగా ఉండదు. గత ఏడాది జయజానకి నాయక ఫలితం ఎలా ఉన్నా అందులో హీరోయిజంని ఎలివేట్ చేసిన తీరు హంసలదీవిలో షూట్ చేరిన భారీ యాక్షన్ ఎపిసోడ్ ఇవన్నీ మాస్ ని బాగానే ఆకట్టుకున్నాయి. ఈసారి ఏకంగా చరణ్ సినిమా కాబట్టి ఆ డోస్ ని అమాంతం పెంచి ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఒక ఎపిసోడ్ ని ఓ రేంజ్ లో తీసాడని వచ్చిన వార్త ఫాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సుమారు 500 వస్తాదుల్లాంటి ఫైటర్లు సినిమాలోని తారాగణం మొత్తం  పాల్గొనగా పది నిమిషాల పాటు సాగే ఈ వయొలెన్స్ మామూలుగా ఉండదని టాక్. తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ చరణ్ కు అన్నయ్యగా నటిస్తుండగా స్నేహ వదినగా కనిపించబోతోంది. వీళ్ళు కాకుండా మరో నలుగురు అన్నయ్యలు- ముగ్గురు వదినలతో కుటుంబం మొత్తం ఆ సీక్వెన్స్ లో ఉంటుందని తెలిసింది. ఇలాంటి రోమాలు నిక్కబొడుచుకునే సీన్ ఒక్కటైనా తన సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకునే బోయపాటి శీను వాటికి మించే రేంజ్ లో ఇది తీర్చిదిద్దినట్టు సమాచారం.

సంక్రాంతికి విడుదల ప్రకటించేశారు  కాబట్టి ఆ విషయం మీద  ఇక అనుమానాలు అంచనాలు అక్కర్లేదు. చరణ్ ఫుల్ మాస్ ఎలెమెంట్స్ తో కూడిన సినిమా చేసి మూడేళ్లు దాటుతోంది. ధ్రువ, రంగస్థలం ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయినా అవి డిఫెరెంట్ జానర్ మూవీస్. రచ్చ నాయక్ తరహాలో ఫుల్ మీల్స్ సినిమా మరొకటి కావాలని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. బోయపాటి శీను వరస చూస్తుంటే ఈజీగా అంచనాలు మించిపోయేలా ఉన్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికి 40 శాతం దాకా పూర్తయినట్టు తెలిసింది. విడుదల సమయం లో హడావిడి పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ కి కావలసినంత సమయం ఉండేలా అంతా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు వినికిడి . అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని కథలో కీలకంగా చూపిస్తూ  రాజవంశపు నేపధ్యం తీసుకున్న బోయపాటి శీను చరణ్ తో ఏ రేంజ్ లో రచ్చ చేసాడో చూడాలంటె జనవరి దాకా ఆగక తప్పదు.
Tags:    

Similar News