టాలీవుడ్ నే కాదు యావత్ భారతీయ సినిమా పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్న రాజమౌళి మల్టీ స్టారర్ షూటింగ్ కు అడుగులు వేగంగా పడనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలయిక గురించి ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇద్దరి హీరోల అభిమానులు ఎప్పుడెప్పుడు ఇది మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. నవంబర్ 18 డేట్ ప్రచారంలోకి వచ్చింది కానీ అంతకన్నా ముందే మొదటివారంలోనే షూటింగ్ కు ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. చరణ్ తారక్ ఇద్దరూ కలిసి పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి ఆ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది.
ప్రారంభోత్సవం గ్రాండ్ గా చేస్తారా లేక సింపుల్ గా కానిస్తారా అనే అప్ డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనేది కామనే కానీ వాళ్ళతో పాటు మరో విదేశీ వనిత కూడా కీలక పాత్రలో కనిపిస్తుందట. సో అనుకున్న టైం కన్నా ముందే మొదలుకాబోతున్న ఆర్ ఆర్ ఆర్ నవంబర్ నుంచి సంచలనాలు రేపబోతోంది. ఇంకో ఏడాదికి పైగా షూటింగ్ ఉంటుంది కాబట్టి 2020లోనే ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్యాప్ లో చరణ్ తారక్ లో చెరో సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చు. రాజమౌళి సబ్జెక్టులు డిమాండ్ చేసినట్టు హీరోలకు వేరే ఆప్షన్ పెట్టుకునే ఛాయస్ ఉండదు.
సో పూర్తిగా ఈ ఇద్దరూ లాక్ అయిపోయినట్టే. బయట ఎక్కడైనా ఫంక్షన్స్ లో చూసుకోవడం తప్పించి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించరు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత తారక్ సినిమా ఇదే. చరణ్ బోయపాటితో చేస్తున్న మూవీ షూటింగ్ చివరి స్టేజిలో ఉంది కాబట్టి సంక్రాంతికి ఆ ఒక్కటి చూసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం భారీ గ్యాప్ తప్పదు. ఈ ఇద్దరు కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్స్ అయినా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రపడుతున్న అభిమానులు ఇంకొంత కాలం వేచి ఉండక తప్పదు.