హీరోయిన్‌తో చెర్రీ ఇటలీ ట్రిప్‌

Update: 2015-05-24 07:30 GMT
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఎండలతో పరిస్థితి భయానకంగా ఉంది. ఇలాంటి వేడి నుంచి ఎస్కేప్‌ అవ్వడానికి సినిమావాళ్లు రకరకాల ప్లాన్స్‌ వేస్తున్నారు. షూటింగు పూర్తవ్వాలి. ఈ ఎండాకాలం నుంచి ఎస్కేప్‌ అవ్వాలి. డ్యూయల్‌ ప్లాన్‌ ఏం ఉంది? అని ఆలోచించిన వారంతా యూరప్‌లో షూటింగులు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో భారీ సినిమాలన్నీ యూరప్‌ షూటింగుల్లోనే ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇప్పుడు చరణ్‌ కూడా షూటింగ్‌ కోసం యూరప్‌ వెళ్లిపోయాడు.

అక్కడ తన హీరోయిన్‌ రకూల్‌తో కలిసి సాంగేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు శ్రీనువైట్ల సహా పరిమిత క్రూతో అక్కడికి వెళ్లాడు చరణ్‌. ప్రస్తుతం అక్కడ కొన్ని పాటల్ని తెరకెక్కించి పనిలో పనిగా యూరప్‌లోని అందమైన లొకేషన్లన్నీ చుట్టొస్తారు. అందమైన అమ్మాయి చెంత రాగా చెర్రీ భళేగా ఆస్వాధిస్తున్నాడు యూరప్‌ని. తర్వాత మళ్లీ హైదరాబాద్‌ సహా పలు చోట్ల షూటింగులతో బిజీ బిజీగా గడపాల్సిన సన్నివేశం జూన్‌ తొలివారంలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్‌ని ఎంజాయ్‌ చెయ్యనిద్దాం.
Tags:    

Similar News