రామ్ చరణ్ రంగస్థలం టీజర్ వచ్చాక వాతావరణం మారిపోయింది. అప్పటి దాక సినిమా ఎలా ఉంటుందా, చెర్రి పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయా అని అనుమాన పడిన వాళ్ళకు దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే. అందులో ఒక్క రామ్ చరణ్ ని మాత్రమే చూపించారు అనే లోటు తప్ప మెగా ఫాన్స్ అంచనాలైతే అది అందుకుంది. త్వరలో పాత్రల పరిచయం పేరుతో చిన్న చిన్న బిట్ టీజర్లు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట సుకుమార్. చివరి దశలో ఉన్న రంగస్థలం షూటింగ్ లో లీడ్ యాక్టర్స్ లో రామ్ చరణ్ - అనసూయ మాత్రమే పాల్గొంటున్నారని తెలిసింది. సమంతా ఇప్పుడున్న షెడ్యూల్ లో లేదు. నిజానికి సుకుమార్ చరణ్-సమంతా మీద కొత్త తరహాలో ఒక రొమాంటిక్ సాంగ్ తీయాలని దేవితో స్పెషల్ గా ట్యూన్ కూడా చేయించాడట. కాని ఇప్పుడది తీయటం లేదని తాజా సమాచారం.
పక్కా కారణం తెలియదు కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అది షూట్ చేయటం జరిగే పనిలా లేదట. సమంతా ఇప్పుడు కాస్త డోస్ ఎక్కువగా ఉంది అనిపించే ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు సిద్ధంగా లేకపోవడం ఒక కారణంగా కొందరు చెబుతుంటే మరోపక్క ఇదే సినిమాతో సమాంతరంగా డెడ్ లైన్ పెట్టుకుని షూటింగ్ జరుపుకుంటున్న మహానటి కోసం ఇప్పుడున్న డేట్స్ సమంతా ఇంతకు ముందే వాళ్ళకు ఇచ్చేసిందట. సో వేరే ఆప్షన్ లేక లేని పోనీ ఒత్తిడి నెత్తి మీద వేసుకుని చివరి నిమిషంలో హడావిడి పడటం కంటే పోస్ట్ ప్రొడక్షన్ ని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చు అనే నిర్ణయంతో వద్దు అనుకుంటున్నట్టు తెలిసింది.
సమయం 60 రోజులే ఉండటంతో సుక్కు టీం డే అండ్ నైట్ వర్క్ చేస్తోంది. టీజర్ అయితే వదిలారు కాని ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్ మొదలు పెట్టాల్సి ఉంది. సెన్సార్ కు ఈ పాటికే అప్లై చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఫిబ్రవరి చివరికంతా ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ రెండో వారానికంతా సెన్సార్ సర్టిఫికేట్ చేతిలో ఉండాలని ఫిక్స్ చేసుకుందట. సో రానున్న ప్రతి రోజు రంగస్థలంకు విలువైనదే. అంతా బాగానే ఉంది కాని చరణ్-సాం మీద ఉండాల్సిన పాటల్లో ఒకటి తగ్గడం నిజమే అయితే మాత్రం ఫాన్స్ అయ్యో అనుకోక తప్పదు.