ఆయన్ను పంపేసిన చెర్రీ కపుల్

Update: 2017-08-31 17:11 GMT
పర్సనల్ సంగతులను పక్కన పెట్టి.. అభిమానులను అలరించేలా ట్వీట్స్.. పోస్టులు చేయడంలో స్టార్ హీరోల భార్యలు భలే ఆకట్టుకుంటున్నారు. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. తమ ఇంటి సంగతుల్లో పర్సనల్ కాని వాటిని.. భలే అందంగా ఫ్యాన్స్ కు చెబుతూ ఉంటుంది.. అప్పుడప్పుడు చూపిస్తుంటుంది కూడా.

ఇప్పుడు లేటెస్ట్ గా ఉపాసన చేసిన పోస్ట్ ఏంటంటే.. తన భర్త చరణ్ తో కలిసి.. వినాయకుడి ప్రతిమను చేతుల్లో పట్టుకున్న ఫోటో. నవరాత్రుల పాటు ఇంటింటా పూజలు అందుకుని నిమజ్జనానికి గణేషుడు బయల్దేరుతుండగా.. తమ ఇంటి గణపతిని కూడా నిమజ్జనం చేస్తున్నామనే సంగతిని ఇలా ఓ ఫోటో ద్వారా చెప్పింది ఉపాసన. అయితే.. ఈ ఫోటోలో కాషాయం రంగు టీ షర్ట్.. బ్లాక్ కలర్ లుంగీతో చెర్రీ లుక్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పైగా బాగా గుబురుగా పెంచిన గెడ్డం లుక్ లో మెగా పవర్ స్టార్.. తన పవర్ చూపించేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం1985 షూటింగ్ స్పాట్ పిక్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి కానీ.. చరణ్ లుక్ ఇంత స్పష్టంగా తెలియడం మాత్రం ఇదే.

ఇక తమ గణేషుడిని పంపేస్తున్నట్లు చెప్పిన ఉపాసన.. బైబై చెబుతూనే ఓ మంచి సందేశం కూడా ఇచ్చింది. "బైబై గణేషా.. దయచేసి ఆశీర్వదించు.. అలాగే అందరి కలలను నెరవేర్చు. ముఖ్యంగా తమ మంచి ప్రవర్తనతో.. సంతోషాన్ని పంచాలనే ఆలోచన ఉన్న వారి కలలను తప్పకుండా నెరవేర్చు" అంటూ వినాయకుడికి తన  విన్నపాన్ని అందించింది ఉపాసన. తన కోసం కాకుండా.. ఇతరుల కోసం దేవుడిని ప్రార్ధించే మంచి మనసు మా మెగా పవర్ స్టార్ వైఫ్ సొంతం అంటూ.. ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను తెగ షేరింగ్ చేసేస్తున్నారు.


Tags:    

Similar News