శ్రీ‌మంతుడి వెంటే బ్రూస్ లీ వెళుతున్నాడు

Update: 2015-09-10 12:28 GMT
మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్రీ‌మంతుడు బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. ఈ సినిమా దాదాపు 150 కోట్ల వ‌సూళ్లు సాధించి బాహుబ‌లి త‌ర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా తెలుగు, త‌మిళ్, ఓవ‌ర్సీస్‌ లో ఒకేసారి రిలీజైంది. తెలుగు రాష్ర్టాల్లో, ఓవ‌ర్సీస్‌ లో ప్ర‌భంజ‌నం సృష్టించింది. అయితే త‌మిళ్‌ లో మాత్రం అంత‌గా ప్ర‌భావం చూపించ‌లేపోయాడు మ‌హేష్‌. శ్రీ‌మంతుడు కాన్సెప్ట్ తంబీల‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు. ఫ‌లితం అక్క‌డ ఆశించిన వ‌సూళ్లు ద‌క్క‌నేలేదు.

అయితేనేం బాహుబ‌లి వెంటే శ్రీ‌మంతుడు కొత్త స్టెప్ న‌లుగురికీ ఆద‌ర్శ‌మైంది.  బాహుబ‌లి, శ్రీ‌మంతుడు తెలుగు సినిమాకి కొత్త దారి చూపించాయ‌న‌డంలో సందేహ‌మే లేదు. ఇంత‌కాలం కేవ‌లం తెలుగు వారికి మాత్ర‌మే అని బోర్డ్ పెట్టుకుని కూచున్న మ‌న స్టార్ హీరోల ఆలోచ‌న‌ల్లో మార్పు తెచ్చాయి ఈ సినిమాలు. ఇక నుంచి ఏ సినిమా రిలీజ్ చేసినా తెలుగుతో పాటు త‌మిళ్‌ లోనూ రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ అమ‌లైపోతోంది. అందుకు త‌మిళ డ‌బ్బింగ్‌ ను కూడా శ‌ర‌వేగంగా పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్‌ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  

తాజాగా రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న బ్రూస్ లీ సినిమాని తెలుగు, త‌మిళ్‌ లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త‌మిళ్‌ లో ఇప్ప‌టికే మావీర‌న్ (మ‌గ‌ధీర‌) పెద్ద హిట్ట‌య్యింది. చ‌ర‌ణ్‌ కి అక్క‌డ క్రేజు తెచ్చిన చిత్ర‌మిది. ఆ త‌ర్వాత ఎవ‌డు, గోవిందుడు అంద‌రివాడేలే కూడా అక్కడ సందడి చేస్తున్నాయ్‌. లేటెస్టుగా బ్రూస్ లీ చిత్రాన్ని ప‌క్కాగా అనువ‌దించి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. చ‌ర‌ణ్ మ‌రోసారి తంబీల మ‌న‌సు దోచుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News