పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న సిద్ధాంతం మనకు తెలిసినదే. అయితే మెగా పవర్ స్టార్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని తుచ తప్పకుండా ఫాలో అవ్వడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ సినిమాలు మాస్ కి దగ్గరగా వుంటాయి కాబట్టి పండక్కి వాటిని టార్గెట్ చేసి దింపుతారు. మొదట్లో సంక్రాతికి తనతో పోటీగా వచ్చిన సినిమాల కలెక్షన్లను అధిగమించి చెర్రీ యునానిమస్ మాస్ హీరో అనిపించుకున్నాడు.
అయితే చరణ్ గత రెండు సినిమాలూ దసరా పండక్కి విడుదలయ్యాయి. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ చిత్రాలు పండుగ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి.
అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ రీమేక్ గా ధ్రువ సినిమాలో కనిపించనున్న చరణ్ అక్టోబర్ 7కి రానున్నాడు. తను పోగొట్టుకున్న ఫెస్టివల్ సీజన్ లోనే సూపర్ హిట్ కొట్టి తిరిగి తన వైభవాన్ని చాటుకోవాలని చరణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.