అన్నయ్య చాటు తమ్ముడిలా ఇండస్ట్రీలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. కానీ కాలక్రమంలో అన్నయ్యకు దీటుగా ఎదిగాడు. గత కొన్నేళ్లలో అన్నయ్యును కూడా దాటిపోయాడు అంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఇప్పుడేదైనా కార్యక్రమానికి పవన్ పిలిస్తే చిరు కచ్చితంగా వస్తాడు.. కానీ చిరు పిలిస్తే పవన్ వస్తాడా అంటే సందేహమే. ఇందుకు గత కొంత కాలంగా అనేక ఉదాహరణలు కనిపించాయి. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు పవన్ పిలవగానే చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కానీ చిరుకు సంబంధించిన వేడుకలకు మాత్రం పవన్ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తుండగా ఆ కార్యక్రమానికి పవన్ వస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎలాగూ పవన్ రాడులే అని పిలవడం మానేయకుండా ఆయన్ని ఆహ్వానించాలని చరణ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో లోలోన ఉండిపోతే ఓకే. కానీ చరణ్ నిన్న మీడియా వాళ్లతో కూడా ఈ విషయం చెప్పేశాడు. సోషల్ మీడియాలోనూ దీని గురించి స్పందించాడు. బాబాయిని పిలవడం తన బాధ్యత అని.. తాను ఇన్విటేషన్ ఇస్తానని.. రావడం రాకపోవడం ఆయన ఇష్టమని అనేశాడు. ఇలా చెప్పడం ద్వారా పవన్ ను డిఫెన్స్ లో పడేశాడు. చరణ్ బహిరంగంగా ఈ మాట చెప్పి పవన్ ను ఆహ్వానించాక రాకపోతే అందరూ తననే వేలెత్తి చూపిస్తారు. పవన్ వేడుకకు పిలవగానే చిరు వచ్చాడు.. కానీ చిరు వైపు నుంచి ఆహ్వానం అందినా పవన్ రాకపోవడమేంటి అన్న చర్చ మొదలవుతుంది. అన్నయ్య మీద గౌరవం ఇదేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరి ఈ పరిస్థితుల్లో పవన్ ఏం చేస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/