తప్పు లేదులే.. చరణ్‌ డేర్ చేస్తున్నాడు

Update: 2016-08-26 22:30 GMT
అక్టోబర్ నెలలోనే గోవిందుడు అందరివాడేలే వచ్చింది. అదే నెలలో బ్రూస్ లీ వచ్చింది. అయినాసరే మళ్ళీ అదే దసరా పండుగనాటికి ''ధృవ'' సినిమా డేట్ ప్రకటించడం చాలా తెలివతక్కువనే అంటూ ఇప్పుడు చాలామంది 'సెంటిమెంటల్' ఎనలిస్టులు చేస్తున్న వాదన. రెండుసార్లు కలసిరాని సీజన్లో ఇప్పుడు మూడోసారి కూడా దూసుకుస్తే.. నెగెటివ్ ప్రచారం అయ్యే ఛాన్సుందని వీరు లాజిక్కు కూడా చెబుతున్నారు. నిజమేనంటారా?

నిజానికి ఈ సీజన్లోనే సినిమాను రిలీజ్ చేయాలని పట్టుబట్టడానికి ఒక మేజర్ కారణం ఏంటంటే.. అసలే సెలవలు కాబట్టి.. పెద్ద స్టార్ల సినిమాలకు ఫ్లాప్ అయినా కూడా 40 కోట్ల వరకు దాదాపు షేర్ వస్తుంది. అందుకే చరణ్‌ కూడా మళ్ళీ మళ్లీ ఇదే సీజన్ పై అంత ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ సెంటిమెంటల్ గా ఆలోచించాల్సిన పనేం లేదు. ఎందుకంటే కంటెంట్ ఉంటే ఆడుతుంది కాని.. సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఆడుతుందా? పెద్ద హీరోలందరికీ తమన్నా అట్టర్ ఫ్లాపులు ఇచ్చిందన్నారు.. కాని ''బాహుబలి'' సినిమా అదరగొట్టేయలేదూ. అసలు దర్శకుడు శంకర్ కు ఫ్లాపే లేదని అనుకున్నారు.. కాని ఒక రీమేక్ సినిమా ఆయన ఆనందం తీర్చేయలేదూ.

కాబట్టి రామ్ చరణ్‌ చక్కగా మరోసారి దసరాకు రావడం కోసం డేర్ చేయడంలో పెద్ద తప్పేం లేదు. కాకపోతే ఈసారైనా సరైన కంటెంట్ తో అలరించి.. మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సి అవసరం ఉంది. అది సంగతి.
Tags:    

Similar News