కొరటాల ఫిలాసఫీ వాడుతున్నావా చెర్రీ?

Update: 2016-09-06 17:30 GMT
ఇకపోతే మొన్నటివరకు 'ధృవ' సినిమాకు సంబంధించి ఏ రూమర్ వచ్చినా కూడా వెంటనే 'గీతా ఆర్ట్స్' టీమ్ ఖండించేసింది. కాని ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. మొన్నటివరకు ధృవ రిలీజ్ డేట్ అక్టోబర్ 7నే అని వాధించిన మెగా పి.ఆర్.ఓ లందరూ ఇప్పడు సైలెంట్ అయిపోయారు. దానితో రామ్ చరణ్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పోస్టుపోన్ అవ్వడం గ్యారంటీ అనే విషయం కన్ఫామ్ అయిపోయింది.

అసలు చరణ్ ఏ స్ర్టాటజీతో ఇప్పుడు ఈ సినిమాను పోస్టుపోన్ చేశాడనే విషయం చూస్తే.. మనోడు కూడా కొరటాల శివ ఫిలాసఫీ ఫాలో అవుతున్నాడట. అప్పట్లో కొరటాల మాట్లాడుతూ.. ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు.. ఆ సినిమాను ఎన్నిసార్లు రీ-షూట్లు చేసినా.. కాసినన్ని రోజులు పాటు అవసరమైన సీన్లు ఎక్కువ టైమ్ తీసుకుని తీసినా.. అలాగే రిలీజ్ డేట్ పోస్టుపోన్ చేసినా కూడా.. అది సినిమాకే మంచిది అంటూ కితాబిచ్చాడు. ఒక్కసారి ధియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాను ఏం చేయలేం కాబట్టి.. ఖచ్చితంగా ముందే ఏదైనా చేయాలి అనే పంథాను ఫాలో అవుతానని కొరటాల వివరించాడు. చూస్తుంటే రామ్ చరణ్‌ కూడా అదే ఫిలాసఫీ పాటిస్తున్నాడేమో అనిపిస్తోంది.

ఇప్పుడు మనోడు హర్రీబర్రీగా సినిమాను పూర్తి చేసేసి.. వెంటనే అక్టోబర్ 7నే తెచ్చేయాల్సిన అవసరం ఏముంది? ఏ డేట్లో వచ్చినా కూడా స్టార్ హీరోల సినిమాలకు పెద్దగా ఫరక్ పడదు. కాబట్టి.. చరణ్‌ కూడా టైమ్ తీసుకుని సినిమాను ప్రిపేర్ చేసి.. డిసెంబర్ లో విడుదల చేస్తాడని టాక్.
Tags:    

Similar News