చరణ్ రావడం పక్కా!

Update: 2018-10-31 09:53 GMT
రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శీను దర్శకత్వంలో చేస్తున్న మూవీ గురించి అభిమానులు కొంత ఆందోళనలో ఉన్న మాట వాస్తవం. కారణం లేకపోలేదు. సంక్రాంతి విడుదల అని గతంలోనే ప్రకటించారు. సమయం చూస్తే అటు ఇటుగా రెండు నెలలు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఇంకా రెండు పాటల షూటింగ్ బాలన్స్ ఉంది. ప్రమోషన్ గురించిన ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఫాన్స్ ఖంగారులో అర్థం ఉంది. దానికి తోడు ఓ వర్గంలో ఇది వాయిదా పడుతుంది అనే రీతిలో ప్రచారం మొదలుకావడంతో అలెర్ట్ అయిన నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చేసాడు.

ఆర్ సి 12 అనుకున్నట్టుగానే సంక్రాంతికే విడుదల అవుతుందని టైంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పాడు. నవంబర్ 10కంతా టాకీ పార్ట్ పూర్తి చేసి మిగిలిన రెండు పాటలను నెలాఖరుకు పూర్తి చేయబోతున్నారు. మరోవేపు డబ్బింగ్ ఒకరోజు ముందే అంటే 9నే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. సో సంక్రాంతి బరిలో రామ్ చరణ్ ఉంటాడా లేదా అనే అనుమానాలకు చెక్ పడినట్టే. ఈ సీజన్ చరణ్ కు బాగా అచ్చి వచ్చింది. కెరీర్ లో బెస్ట్ మాస్ సినిమాలుగా నిలిచిన నాయక్-ఎవడు విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది సంక్రాంతికే.

అందుకే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బోయపాటి శీను సినిమా కూడా అదే సమయంలో రానుండటం ఫాన్స్ సెంటిమెంట్ గా కూడా ఫీలవుతున్నారు. కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో చెర్రీ అన్నయ్యలుగా ఆర్యన్ రాజేష్ తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ కీలకమైన పాత్రలు చేస్తున్నారు. సో బరిలో తప్పుకునే ఛాన్స్ లేదని తేల్చి చెప్పేసారు కాబట్టి ఎన్టీఆర్ తో పాటు ఎఫ్2తో బాక్స్ ఆఫీస్  బరిలో దూకడానికి చరణ్ రెడీ అవుతున్నాడు.
Tags:    

Similar News