ధృవ తరువాత బ్రేకిచ్చాకే ఇంకోటి

Update: 2016-08-18 05:30 GMT
రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ పనుల్లో తెగ బిజీగా ఉన్నాడు. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేసే టార్గెట్ ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అందుకునేందుకు ధృవ టీం బాగానే కష్టపడుతోంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత కావడంతో.. అన్ని పనులు చకచకా నడిచిపోతున్నాయి. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే చెప్పేసుకున్నాం.

వరుసబెట్టి సినిమాలు చేయడంలో చరణ్ అంత యాక్టివ్ గా ఉండడు. ఓ సినిమాకి ఇంకో సినిమాకి మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ధృవ తర్వాత కూడా ఓ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటివారంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతున్న ధృవ రిలీజ్ అయితే.. నవంబర్ చివర్లో సుకుమార్ సినిమా మొదలుపెడతాడట చరణ్. అంటే ఇది రిలీజ్ అయ్యి.. ఆది స్టార్ట్ అయ్యే మధ్యలో ఓ నెలన్నర గ్యాప్ ఉండనుందన్న మాట. జూన్ నుంచి వరుసగా షూటింగ్ చేస్తుండడంతో ఈ మాత్రం గ్యాప్ తీసుకోక తప్పనిసరి అనే చెప్పాలి.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడు. అయితే.. నెలల తరబడి షూటింగ్ చేయబట్టి బ్రేక్ అనడం బాగానే ఉంది కానీ.. ముందే షూటింగ్ మొదలైనా.. అప్పటివరకూ స్పీడ్ అందుకోకపోవడానికి కారణం చెర్రీనే కదా! అదేదో ముందే ప్లాన్ చేసిన షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ ఫినిష్ చేస్తే ఇలాంటి సమస్యలు రావు కదా!
Tags:    

Similar News