కొత్త యేడాది ఆరంభంలో కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడు రామ్ చరణ్. సంక్రాంతికి కొబ్బరికాయ కొట్టే అవకాశాలున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లూ చురుగ్గా సాగుతున్నాయి. తమిళంలో విజయవంతమైన `తని ఒరువన్` రీమేక్ లో నటించాలని చెర్రీ డిసైడైయిన విషయం తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడిగా ఇప్పటికే అరవింద్ స్వామిని ఓకే చేసేశారు. కథానాయిక ఎంపిక కూడా దాదాపుగా పూర్తయినట్టే అని సమాచారం. అందులో కథానాయికగా శ్రుతిహాసనే నటించబోతోందని సమాచారం. తాజాగా టైటిల్ కూడా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సినిమాకి `రక్షక్` అనే పేరును ఖరారు చేస్తారని తెలిసింది.
సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆ పాత్రకి తగ్గట్టుగా రక్షక్ అనే పేరయితేనే బాగుంటుందని చిత్రబృందం ఒక నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. బ్రూస్ లీతో ఇటీవల పరాజయాన్ని చవిచూశాడు చెర్రీ. ఆ సినిమా అన్నిరకాలుగా ఆయన్ని అసంతృప్తికి గురిచేసింది. అందుకే మంచి కథతో కూడిన తని ఒరువన్ రీమేక్ లో నటించి బ్రూస్ లీ ప్రభావం నుంచి బయటికి పడాలని నిర్ణయించుకొన్నాడు చరణ్. అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు.