చరణ్‌ థ్యాంక్స్ అండ్ సారీ చెప్పాడు

Update: 2016-08-24 17:01 GMT
రామ్ చరణ్ ఇప్పుడు చాలా కొత్తగా కనిపించడమే కాదు.. చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు కూడా. గతంలో నెగెటివ్ గా మెగా ఫ్యామిలీ మీద వార్తలు రాస్తే.. నాకు వెంట్రుకతో సమానం అన్న చెర్రీ.. ఇప్పుడు మాత్రం మీడియాకు ఏదైనా ఇబ్బందులు కలిగియుంటే ఐ యామ్ సారీ అంటున్నాడు.

''నాన్న గారి పుట్టినరోజు నాడు పలు ఈవెంట్లలో పాల్గొన్న మీడియా వారందరికీ కృతజ్ఞతలు. కాకపోతే ఒక ఈవెంటులో మీడియాకు సంబంధించి జరిగిన ఏర్పాట్లలో చిన్న మిస్టేక్ జరిగిందని తెలిసింది. క్షమించండి. ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లే చేయిస్తాను. మాకు ఈ సపోర్టు అందిస్తున్నందుకు థ్యాంక్స్'' అంటూ మీడియాకు సారీ చెబుతూనే స్పెషల్ మెసేజ్ ఒకటి పంపాడు చరణ్. ఇప్పటివరకు ఎప్పుడూ మీడియాతో ఇంత క్లోజ్ గా ఇంటరాక్ట్ అవ్వని చరణ్‌.. ఇప్పుడు ట్రూ బ్లూ మెగా స్టార్ తరహాలో ప్రవర్తించాడని మీడియాలో చాలామంది అనుకోవడం విశేషం.

ఇకపోతే ఒక సెవెన్ స్టార్ హోటల్లో ఇచ్చిన పార్టీకు కూడా చాలా మీడియా సంస్థల పెద్దలను ఇన్వయిట్ చేశాడు చరణ్‌. వారందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట. స్వయంగా చరణ్‌ చేతితో ప్లేట్ లో చికెన్ ముక్కలు వడ్డిస్తుంటే.. వామ్మో ఆ సీన్ తలుచుకుంటుంటేనే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు మీడియా ప్రతినిథులు. అది సంగతి.
Tags:    

Similar News