పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఒకేసారి విడుదల చేస్తూ.. పవన్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. అయితే.. ఈ మూవీపైనా, పవన్ కళ్యాణ్ పైనా.. కమల్ ఆర్ ఖాన్ అనే బాలీవుడ్ యాక్టర్ ముందునుంచీ నోరు పారేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు నేరుగా ఓ సవాల్ విసిరాడు ఈ ఖాన్.
'సర్దార్ గబ్బర్ సింగ్ కు కనీసం 10 మంది ప్రేక్షకులు వస్తే.. నేను ఏపీ - తెలంగాణల్లో రెండు పగళ్లు - రెండు రాత్రులు బట్టలూడతీసుకుని నగ్నంగా పరిగెడతా' అంటూ ట్వీట్ చేసి దుమారం రేపాడు. పవన్ కూడా స్టార్ అంటే.. ప్రపంచంలో ఎవడైనా స్టార్ అయిపోవచ్చంటూ గతంలో ఓసారి ట్వీట్ చేసి, తర్వాత పవన్ కళ్యాణ్ గొప్పదనం గురించి తెలిసిందన్న కమల్ ఆర్ ఖాన్.. సరిగా విడుదలకు ముందు పవర్ స్టార్ పై దాడి చేయడం గమనించాలి. అయితే.. ఈ ఖాన్ సవాలును అప్పటికప్పుడే ఖండించాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
సాధారణంగా పవన్ కి వ్యతిరేకంగా ట్వీట్స్ వేసే వర్మ.. 'నగ్నంగా పరిగెట్టడానికి రెడీగా ఉండు, పవన్ కళ్యాణ్ పవర్ ని తక్కువగా అంచనా వేస్తున్నావ్' అంటూ ట్వీట్ చేయడం విశేషం. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండే పవన్.. బాలీవుడ్ లో తన మూవీని ప్రచారం చేసేందుకు పెద్దగా ఆరాటపడ్డం లేదు. ఓ రెండు ఇంటర్వ్యూలు తప్ప స్పెషల్ ప్రమోషన్స్ ఏం చేయలేదు. కేవలం ఈ కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుందన్న నిర్మాణ సంస్థ ఈరోస్ కాన్ఫిడెన్స్ తోనే ఇలా హిందీ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు పవన్.