వర్మ ఎప్పుడూ అంతే.. ఓ సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడో.. ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు. సడెన్‌గా ఓ సినిమాను అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత దాని ఊసే ఎత్తడు. ఇంకేదో సినిమా మొదలుపెట్టి పూర్తి చేసేస్తాడు. ఆ సినిమా కొన్ని రోజులు వార్తల్లో ఉంటుంది. ఆ తర్వాత మాయమవుతుంది. రిలీజ్ ఎప్పుడో చెప్పడు. సడెన్‌గా రిలీజ్ అంటాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు మాత్రం చేసుకెళ్లిపోతుంటాడు.
రాజశేఖర్‌తో చేసిన 'పట్టపగలు' ఎప్పట్నుంచో విడుదల కోసం ఎదురు చూస్తోంది. కానీ వర్మ మాత్రం దాని ఊసే ఎత్తట్లేదు. 'శ్రీదేవి' పేరుతో అప్పుడో కాంట్రవర్శల్ మూవీ మొదలుపెట్టాడు. అది తర్వాత 'సావిత్రి'గా మారింది. షూటింగ్ అయిపోవచ్చిందన్నాడు. దాని సంగతేంటో ఎవరికీ తెలియట్లేదు. అంతలోనే 'స్పాట్' అంటూ ఓ ఆడియో టీజర్‌తో హంగామా చేశాడు. కానీ అది కూడా కొన్నాళ్ల తర్వాత వార్తల్లో లేకుండా పోయింది.
ఐతే ఇవన్నీ పెద్దగా పేరులేని సినిమాలు కాబట్టి ఓకే. ఐతే మంచు మనోజ్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖ తారాగణం నటించిన 'అటాక్' సంగతి కూడా ఎటూ తేలకుండా పోయింది. నెల కిందట ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ.. ఆ తర్వాత దాని ఊసే ఎత్తట్లేదు. ఎంచక్కా 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా పనిలో మునిగిపోయాడు. 'అటాక్' ఆడియో ఫంక్షన్ ఎప్పుడు.. రిలీజ్ ఎప్పుడు అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. జూన్ నెలంతా చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. ఈ నెలలో రిలీజ్ చేసుకుని ఉంటే వర్మ పంట పండేది. కానీ ఆ ప్రయత్నమే చేయలేదు. ఇక బాహుబలి ఫీవర్ మొదలవుతోంది. ఆ తర్వాత శ్రీమంతుడు, రుద్రమదేవి, కిక్-2 లాంటి భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. కాబట్టి ఇంకో రెండు నెలలు వర్మ 'అటాక్' ఉండకపోవచ్చు.