టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో 'ఉస్తాద్' రామ్ పోతినేని - తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్ ఈ మూవీతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. '#RAPO19' చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో రూపొందించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేశామని.. అద్భుతంగా వచ్చిందని రామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే ఇందులో హీరో పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. ఈ చిత్రంలో రామ్ పోతినేని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. పవర్ ఫుల్ మాస్ స్టోరీతో రూపొందే ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ మోడ్రన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతో రామ్ తనలోని మరో కోణాన్ని చూపించడానికి ఆస్కారం వుంటుంది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రూటు మార్చిన ఉస్తాద్.. 'రెడ్' సినిమాలో డ్యూయల్ రోల్ కనిపించి మెప్పించాడు. ఈ క్రమంలో లింగుస్వామి చిత్రంలో ఎలా కనిపించబోతున్నాడో చూడాలి.
ఇకపోతే ఈ చిత్రంలో రామ్ సరసన టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చానున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. '#RAPO19' ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.