''రొటీన్ సినిమా రొటీన్ సినిమా అన్నారు.. చాలా గట్టిగా వినపడింది. సో.. ఇప్పుడు జాగ్రత్తపడ్డాను. ఈసారి అంతా డైరక్టర్ మీదే వదిలేశా'' అంటూ సెలవిచ్చాడు హీరో రామ్. 'నేను శైలజ' ఆడియో రిలీజ్ సందర్భంగా మనోడు ఈ కామెంట్లు చేశాడు. వరుసపెట్టి బీభత్సాది ఫ్లాపులు రావడంతో.. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో వస్తున్న రామ్.. అందుకే ఎంతో కేర్ ఫుల్ గా ఈ సినిమాను తీసుకొచ్చాడట.
''ఈసారి కథను నమ్ముకుని.. దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయా. చిన్నప్పుడు ఎప్పుడో పెదనాన్న (స్రవంతి రవి కిషోర్) గారు నువ్వేకావాలి - నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు చెబుతుంటే.. కథ తెలియకుండా ఎక్సయిట్ అయ్యేవాడిని. అలాగే ఇప్పుడు కిషోర్ తిరుమల కథ చెప్పినప్పుడు కూడా అదే విధంగా ఎక్సయిట్ అయ్యా. ఒక డైలాగ్ కు అంత పవర్ ఉంటుంది'' అంటూ చెప్పుకొచ్చాడు రామ్. ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడు రామ్ మన దర్శకుడికి ఒక మాట చెప్పాడట. నువ్వేం చేస్తావో తెలియదు.. నేను కత్తిలాగా కనిపించాలి అని చెప్పాడు. అందుకే రామ్ ను కొత్తగా చూపించినట్లున్నాడు. ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధమవుతోంది.
ఇకపోతే.. ఈసారి అంతా దర్శకుడికే వదిలేశా అని రామ్ ఒప్పేసుకున్నాడంటే.. మొన్నటి వరకు దర్శకులను పనిచేయకుండా తాను బీభత్సంగా ఫింగరింగ్ చేసినట్లేగా?? అంతేకదూ!!