చిత్రం : రామారావు: ఆన్ డ్యూటీ
నటీనటులు: రవితేజ-దివ్యాంశ కౌశిక్-రజిష విజయన్-వేణు తొట్టెంపూడి-జాన్ విజయ్-నాజర్-రాహుల్ రామకృష్ణ-అరవింద్ కృష్ణ-తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: శరత్ మండవ
కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు మాస్ రాజా రవితేజ. తమిళంలో ఒక సినిమా చేసి.. తెలుగులో అవకాశం కోసం చూస్తున్న శరత్ మండవ అనే యువ దర్శకుడితో ఆయన చేసిన చిత్రం.. రామారావు: ఆన్ డ్యూటీ. దీని ప్రోమోలు చూస్తే రవితేజ మార్కు మాస్ సినిమాలకు భిన్నంగా.. కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్ లాగా కనిపించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రామారావు' ప్రోమోలకు తగ్గట్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిందా.. రవితేజ ఏమేర తన అభిమానులను అలరించాడు.. తెలుసుకుందాం పదండి.
కథ:
రామారావు (రవితేజ) ఒక నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారి. తాను పని చేసిన పని చోటా జనం కోసం నిలబడి వాళ్లకు ప్రయోజనం చేకూర్చిన అతను రాజకీయ నాయకులకు కంటగింపుగా మారి పదే పదే బదిలీ అవుతూ.. ఉంటాడు. చివరికి చిత్తూరు జిల్లాలో తాను పుట్టి పెరిగిన ఊరికే బదిలీ మీద వస్తాడు. అక్కడ తాను ఒకప్పుడు ప్రేమించి.. కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయిన మాలిని (రజిష విజయన్) కష్టాల్లో ఉన్నట్లు రామారావుకు తెలుస్తుంది. ఆమె భర్త చాన్నాళ్ల నుంచి కనిపించట్లేదని తెలిసి అతణ్ని వెదికే ప్రయత్నంలో.. ఆ ఊరికే చెందిన 20 మంది ఆచూకీ లేకుండా పోయారని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని పసిగడతాడు రామారావు. మరి ఈ 20 మంది ఏమయ్యారు.. వారి అదృశ్యం వెనుక ఉన్నదెవరు.. మాలిని భర్తకు ఏమైంది.. దీని వెనుక మొత్తం గుట్టును రామారావు ఎలా బయట పెట్టాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
రవితేజ కెరీర్లో చాలా వరకు పెద్ద హిట్టయిన సినిమాలన్నీ అతడి మార్కు మాస్ మసాలా సినిమాలే. అతను మధ్య మధ్యలో రూటు మార్చి కొంచెం భిన్నంగా సినిమా చేసినపుడల్లా ఎదురు దెబ్బే తగులుతూ వచ్చింది. అలా దెబ్బ తగిలినపుడల్లా మళ్లీ మాస్ రూట్లోకి వెళ్లి హిట్టు కొట్టి సేఫ్ జోన్లోకి వచ్చాక.. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ డిఫరెంటుగా ఏదో ఒకటి ట్రై చేస్తుంటాడు. కానీ మంచి ఉద్దేశంతో చేసిన ఇలాంటి సినిమాల్లో ఆయనకు ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. నా ఆటోగ్రాఫ్.. శంభో శివ శంభో.. సారొచ్చారు.. డిస్కో రాజా.. ఇలా ఈ జాబితాలో చాలా సినిమాలు కనిపిస్తాయి. ఈ సినిమాలన్నింట్లో విషయం ఉన్నప్పటికీ.. ఎక్కడో కొన్ని లోపాలు దొర్లి.. వేరే కారణాలు కూడా తోడై అవి నిరాశకు గురి చేశాయి. అయినా ఇప్పుడు తన శైలికి భిన్నంగా 'రామారావు: ఆన్ డ్యూటీ' అనే భిన్నమైన సినిమా చేశాడు. ఇది రవితేజ మార్కు సినిమా కాదని ప్రతి ప్రోమోలో తెలుస్తూనే వచ్చింది. కానీ ఈ సినిమా చూశాక.. రొటీన్ అయినా పర్లేదు రవితేజ తన మార్కు మసాలా సినిమాలకే పరిమితం అయితే బాగుంటుందేమో అనే ఆలోచన తన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకూ కలిగితే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందులో రవితేజ మార్కు ఎంటర్టైన్మెంటూ లేదు.. అలా అని చిత్ర బృందం ఊదరగొట్టినట్లు ఇది 'కంటెంట్ రిచ్' సినిమానూ కాదు. వాస్తవ ఘటనల నేపథ్యంలో బ్రహ్మాండమైన థ్రిల్లర్ చూడబోతున్న భావనతో మొదలై.. మధ్యలోకి వచ్చేసరికి తెరపై ఏం జరుగుతోందో అర్థం కాని అయోమయానికి గురి చేసి.. చివరికొచ్చేసరికి ఇదేం సినిమారా బాబూ అని పట్టుకునేలా చేస్తుంది 'రామారావు'.
కొన్ని సినిమాలు చూస్తున్నపుడు.. హీరో అసలెలా ఈ కథను ఓకే చేశాడు.. మేకింగ్ దశలో ఇది వర్కవుట్ కాదనే అనుమానం ఎవరికీ కలగలేదా.. ఫస్ట్ కాపీ చూసి ఏ ధైర్యంతో సినిమాను రిలీజ్ చేశారు అనే సందేహాలు వెంటాడుతుంటాయి. 'రామారావు' కూడా ఆ కోవలోని సినిమానే. ఈ సినిమా మొత్తంలో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఒక్క ఎపిసోడ్ లేదు. 'మిస్ ఫైర్' అన్న మాటకు అసలైన అర్థం ఏంటో చూపిస్తూ.. ఫలానా సీన్.. ఫలానా క్యారెక్టర్ అని తేడా లేకుండా 'రామారావు'లో ప్రతిదీ బెడిసి కొట్టేసింది. తమిళం, మలయాళంలో మంచి పేరున్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న రజిష విజయన్.. ఈ సినిమాలో కొన్ని సీన్లలో ఇచ్చిన హావభావాలు చూస్తే.. ఇంకో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం గమనిస్తే.. ఫిలిం మేకింగ్ అంటే అసలు అవగాహన లేని వాళ్లు తలా తోకా లేకుండా తీసే యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ గుర్తుకొస్తాయి. ఎలాంటి సినిమాలో అయినా.. ఏ పాత్రలో అయినా తనదైన ఎనర్జీతో అదరగొట్టే రవితేజ సైతం కొన్ని సీన్లలో ఏం ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో తెలియక బ్లాంక్ గా నిలబడే పరిస్థితి వచ్చిందంటే 'రామారావు' ఎంతగా మిస్ ఫైర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
'పుష్ప'కు నేపథ్యంగా మారిన ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూనే 'రామారావు' కూడా తిరుగుతుంది. ఆ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన ఉదంతాల మీదే దర్శకుడు శరత్ మండవ కూడా పరిశోధన చేసి ఈ సినిమా తీసినట్లున్నాడు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన తమిళనాడు ఎర్రచందనం కూలీల మాస్ ఎన్ కౌంటర్.. దాంతో ముడిపడ్డ స్మగ్లింగ్ రాకెట్ చుట్టూ అతను కథను అల్లుకున్నాడు. తమిళంలో ఇలాంటి వాస్తవ ఘటనల చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాలను పకడ్బందీగా తీస్తుంటారు తమిళ దర్శకులు. 'విసారణై'.. 'జై భీమ్' లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఐతే చాలా ఏళ్లు తమిళ ఇండస్ట్రీలో పని చేసిన శరత్.. తన కథకు స్ఫూర్తిగా ఎంచుకున్న అంశాలు బాగానే ఉన్నాయి కానీ.. వాటి చుట్టూ పకడ్బందీ కథను అల్లడంలో అతను విఫలమయ్యాడు. అసలు రవితేజతో ఇలాంటి కథ తీయాలనుకోవడమే అతను చేసిన అతి పెద్ద తప్పు. ఏ దశలోనూ ఇది రవితేజ చేయాల్సిన సినిమాలా కనిపించదు. హీరోగా అతనున్నా మరొకరున్నా తేడా ఏమీ ఉండదు. ఇలాంటి కథలకు రవితేజ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. అతణ్ని హీరోగా పెట్టుకున్నపుడు హీరో పాత్రను సరిగా ఎలివేట్ చేసే ప్రయత్నం అయినా చేయాల్సింది. కథ చెడకుండానే కమర్షియల్ అంశాలైనా జోడించాల్సింది.
రవితేజ మార్కు మిస్సయినా.. కనీసం కథ అయినా పకడ్బందీగా ఉండి.. రేసీ స్క్రీన్ ప్లే తోడై సినిమా ఆసక్తికరంగా అయినా సాగిందా అంటే అదీ లేదు. పేరుకే థ్రిల్లరే తప్ప.. సినిమా ఎక్కడా అసలు ఉత్కంఠ రేకెత్తించదు. సినిమాలోని ట్విస్టుల్ని చాలా పేలవంగా ప్రెజెంట్ చేసి ప్రేక్షకుల ఆసక్తిని ఎక్కడిక్కడ చంపేశాడు దర్శకుడు. 'పుష్ప' సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ రసవత్తర డ్రామా చూశాక.. 'రామారావు'లో కొంచెం కూడా కిక్ ఇవ్వదు. అందులో మాదిరి ఇందులో హీరో ఎలివేషన్లు కానీ.. ఉత్కంఠభరిత సన్నివేశాలు ఇందులో అవకాశమే లేకపోయింది.
సినిమా ఆరంభానికి ముందు కథకు కీలకం అన్నట్లుగా చూపించిన సన్నివేశం చూసి ఏదో ఊహించుకుంటాం. చివరికి దీని గుట్టు విప్పాక తుస్సుమనిపిస్తుంది. హీరో పాత్ర ఆరంభం నుంచి చాలా డల్లుగా కనిపిస్తూ.. రవితేజ మార్క్ అంటూ ఏమీ లేకుండా నిస్సారంగా సాగడంతో చాలా త్వరగా దానికి డిస్కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. ఏదో ఒక దశలో ఆ పాత్ర.. కథ మలుపు తిరుగుతాయేమో అని ఎదురు చూస్తే.. చివరికి నిరాశే మిగులుతుంది. తమిళ నటుడు జాన్ విజయ్ చేసిన విలన్ పాత్ర అయితే మరీ సిల్లీగా తయారైంది. కొండంత రాగం తీసి.. సామెతను గుర్తు చేస్తుంది విలన్ క్యారెక్టర్. ప్రథమార్ధం-ద్వితీయార్ధం అని తేడా లేకుండా ఆద్యంతం 'రామారావు' రాంగ్ ట్రాక్ లోనే నడిచి ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగులుస్తుంది. ఈ స్థాయి పెద్ద సినిమాల్లో ఈ మధ్య ఇంతగా మిస్ ఫైర్ అయిన సినిమా ఇంకోటి లేదు అని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తంలో ప్రేక్షకులను షాక్ కు గురి చేసిన ఏకైక ట్విస్ట్ ఏదంటే.. ఈ కథను ముగించకుండా దీనికి సీక్వెల్ కూడా ఉన్నట్లు చివర్లో హింట్ ఇవ్వడం.
నటీనటులు:
బహుశా రవితేజ సహా ఇందులో నటిస్తున్న అందరికీ కూడా కథ పూర్తిగా తెలియకో.. లేక అర్థం కాకో.. దర్శకుడు చెప్పినట్లు చేసుకుంటూ పోయారేమో అనిపిస్తుంది. ఆర్టిస్టులందరి పెర్ఫామెన్స్ అలా సాగింది మరి. రవితేజ అసలేం చూసి ఈ కథను ఓకే చేశాడన్నది అర్థం కాని విషయం. పూర్తిగా దర్శకుడికి సరెండర్ అయి.. తన శైలిని పక్కన పెట్టి కథ ప్రధానంగా సాగే సినిమా చేద్దామని అతను అనుకుని ఉండొచ్చు కానీ.. 'ఆచార్య'లో చిరంజీవిలా ఇక్కడ అతడి చేతులు కట్టేసినట్లు అయింది. ఇది అతడికి ఏమాత్రం నప్పని సినిమా. రవితేజ ఉన్నంతలో బాగానే నటించినా.. అభిమానులు ఏ దశలోనూ రామారావు పాత్రతో కనెక్ట్ కాలేరు. మాస్ రాజా ఎనర్జీని చూపించే ఎపిసోడ్లేవీ ఇందులో లేవు. హీరోయిన్లు రజిషా విజయన్.. దివ్యాంశ కౌశిక్ లకు ఈ సినిమా చేదు అనుభవమే. వారి పాత్రలు మరీ పేలవం. దివ్యాంశ అయితే మరీ ఉత్సవ విగ్రహంలా తయారైంది. మంచి నటి అయిన రజిషా ఇందులో ఇచ్చిన హావభావాలు షాక్ కు గురి చేస్తాయి. విలన్ పాత్రలో కనిపించిన జాన్ విజయ్ భరించడం కష్టమే. చాలా ఏళ్ల విరామం తర్వాత 'రామారావు'తో రీఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి ఇందులో సీరియస్ రోల్ చేస్తే.. అది కాస్తా కామెడీగా తయారై అతను ఎప్పుడెప్పుడు స్క్రీన్ నుంచి పక్కకు వెళ్లిపోతే బాగుంటుందో అని ప్రేక్షకులకు అనిపించేలా ఆ పాత్ర తయారైంది. ఒకప్పుడు డబ్బింగ్ వాయిస్ కు బాగా అలవాటు పడడం వల్ల ఇందులో తన సొంత వాయిస్ వినిపించేసరికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
సామ్ సీఎస్కు తమిళంలో థ్రిల్లర్ సినిమాలకు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించిన ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఇక్కడ అతడి మ్యాజిక్ పని చేయలేదు. సినిమాలో విషయానికి తగ్గట్లే అతడి బీజీఎం కూడా తయారైంది. అసలే సన్నివేశాలు డల్లుగా ఉంటే.. బీజీఎం అంతకుమించి నీరసంగా సాగుతుంది. తెలుగు సినిమాల మీద.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి మీద అతడికి ఏమాత్రం అవగాహన లేదనిపిస్తుంది. పాటలు కూడా చాలా నీరసంగా సాగాయి. సీసా సీసా అంటూ సాగే ఐటెం సాంగ్ సహా ఒక్కదాంట్లోనూ ఊపు లేదు. అసలు ఆ పాట వచ్చే టైమింగే సినిమాలో పెద్ద బ్లండర్. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగానే సాగింది. నిర్మాణ విలువల విషయంలో రాజీ ఏమీ కనిపించలేదు. కానీ ఇప్పటిదాకా నిర్మించిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా సుధాకర్ చెరుకూరి అభిరుచిని అయినా చాటాయి. తనకు ఎంతో కొంత పేరు తెచ్చాయి. కానీ 'రామారావు' మాత్రం ఆయనకు అన్ని రకాలుగా నిరాశనే మిగులుస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శరత్ మండవ.. తన సినిమా గురించి ప్రమోషన్లలో.. ప్రి రిలీజ్ ఈవెంట్లలో చెప్పిన మాటలకు.. తెరపై కనిపించిన దానికి పొంతనే లేదు. ఈ సినిమాతో అసలేం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదసలు. బలం లేని కథ.. అనాసక్తికర కథనంతో శరత్ రచయితగా.. దర్శకుడిగా పూర్తిగా నిరాశ పరిచాడు. అతను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి.. మాస్ రాజా శైలికి తగ్గ మాస్ సినిమానూ తీయలేకపోయాడు. అదే సమయంలో తాను ఎంచుకున్న 'థ్రిల్లర్' జానర్ కూ న్యాయం చేసేలా పకడ్బందీగానూ సినిమాను నడిపించలేకపోయాడు.
చివరగా: రామారావు.. ఆఫ్ డ్యూటీ
రేటింగ్-1.75/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater