పెద్ద సెలబ్రిటీ లేనిదే ప్రచార వేదికలకు కళ కనిపించదు. అందుకే ఎవరైనా బిగ్ స్టార్ తమ సినిమాకి ప్రమోషన్ చేయాలని యువహీరోలు కోరుకోవడం సహజం. ఇప్పుడు విశ్వక్ సేన్ కోసం ఏకంగా అల్లూరి సీతారామరాజు (ఆర్.ఆర్.ఆర్) గా అలరించిన రామ్ చరణ్ స్వయంగా దిగి వస్తున్నారు. ఈ ఆదివారం (16 అక్టోబర్ 2022) రాజమండ్రిలో జరగనున్న ఓరి దేవుడా ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానున్నారు.
ప్రస్తుతం ఒక వారం షెడ్యూల్ లో భాగంగా రంపచోడవరం కాకినాడలో శంకర్ సినిమా షూటింగ్ లో ఉన్న చరణ్ తన షూటింగ్ నుండి కొంత సమయం తీసుకొని ఓరి దేవుడా ఫంక్షన్ కు హాజరు కాబోతున్నాడు.
విజయ్ సేతుపతి- అశోక్ సెల్వన్ - రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన `ఓ మై కడవులే` చిత్రానికి ఇది తెలుగు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ - విశ్వక్ సేన్ - మిథిలా పాల్కర్ తెలుగు వెర్షన్ లో నటించారు. ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల కానుంది. విశ్వక్ సేన్ లాంటి యువహీరోతో కలిసి వెంకీ ఎలాంటి భేషజం లేకుండా నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ బాగానే వర్కవుటైందన్న టాక్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.