హోస్ట్ గా శివగామి అలరించిందా...!

Update: 2019-09-01 05:14 GMT
బిగ్ బాస్ ప్రేక్షకులకు శనివారం ఎపిసోడ్ లో అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. కింగ్ నాగార్జున పుట్టినరోజు వేడుకల కోసం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ కు వెళ్లడంతో ఆయన స్థానంలో శివగామి ‘రమ్యకృష్ణ’ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇంటి సభ్యులకు కూడా ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో వారు ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అయితే నాగార్జున ఎందుకు రావడం లేదో డైరెక్ట్ గా ఆయనతోనే మాట్లాడమని చెప్పడంతో నాగ్ వీడియో వస్తుంది. తను ఎందుకు బిగ్ బాస్ హౌస్‌కి రాలేదో వివరిస్తూ ఈ రెండు రోజులూ ఈ కింగ్ ప్లేస్‌లో ఈ క్వీన్ హోస్ట్‌గా ఉంటుందని నాగ్ చెబుతారు. అనంతరం ఇంటి సభ్యులు నాగార్జునకు బర్త్ డే విషెష్ అందించారు.

ఇక దీని తర్వాత రమ్యకృష్ణ-నాగ్ లు సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో పాత్రలు కాసేపు పోషించారు. నిన్ను చూస్తుంటే గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నాయని నాగ్ చెప్పగానే రమ్య సిగ్గుపడుతూ...పో బంగార్రాజు అంటూ డైలాగ్ వేసింది. వీరి రొమాన్స్ తర్వాత రమ్యకృష్ణ  ఇంటి సభ్యులతో ఓ ఆట ఆడించారు. ఇద్దరు ఇంటి సభ్యులని పిలిచి వాళ్లలో మీకు నచ్చింది.. నచ్చనిది ఏంటి అంటూ వెంట వెంటనే చెప్పాలని టాస్క్ ఇచ్చారు. అనంతరం ఇంటి సభ్యులు ఇద్దరిద్దరుగా వచ్చి ఒకవైపు పొగుడుతూనే.. మరోవైపు వాళ్లపై ఉన్న కంప్లైంట్స్ చెప్పారు.

అలాగే హౌస్ లో ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పాలని అనడంతో కొందరు తమకు ఎవరు అన్యాయం చేశారో చెప్పారు. వారికి చివరిలో పనిష్మెంట్ ఇచ్చారు. అయితే నాగ్ ప్లేస్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రమ్యకృష్ణ ఆశించిన మేర మెప్పించలేకపోయిందనే చెప్పాలి. ఏదో బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చదువుతున్నట్లే అనిపించింది కానీ నాగార్జునలా నేచురల్ చేసినట్లు అనిపించలేదు. మధ్య మధ్యలో సీరియస్ అవుతున్నారు కానీ అది స్క్రిప్ట్ లో భాగమే అని తెలిసిపోయేలా ఉంది. కాకపోతే నాగార్జునలా మెప్పించలేకపోయిన తొలిసారిగా హోస్ట్ గా తన స్థానానికి న్యాయం చేసిందనే చెప్పాలి. మొత్తానికి నాగ్ ప్లేస్ ని అయితే భర్తీ చేయలేదు.

వీరి ఎపిసోడ్ తర్వాత ఇంటిని క్లీన్ చేసే పనిలో ఉన్న పునర్నవి - రాహుల్ మధ్య గొడవ వచ్చింది. ఏదో పని విషయంలో పునర్నవి రాహుల్ ని తిట్టేసింది. దీంతో రాహుల్ బాబా మాస్టారుకు చెప్పడంతో తెలియక చేశాడు క్షమించు భూపాళం అంటూ బాబా సరదాగా మాట్లాడాడు. అలాగే నాగార్జున పుట్టినరోజు సందర్బంగా రాహుల్ ఓ పాట రాసి పాడటం - దానికి బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేసి ఇంటి సభ్యులతో  డ్యాన్స్ చేయించాడు. అనంతరం నాగార్జునకి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు.


Tags:    

Similar News